Saturday, April 20, 2024

హెల్మెట్ లేకుండా బైక్ న‌డిపితే లైసెన్స్ ర‌ద్దు (వీడియో)

- Advertisement -
- Advertisement -

license revoked if bike is riding without helmet

చలానాతో సరిపెట్టబోము
తొలిసారి పట్టుబడితే మూడు నెలలు లైసెన్సు ర‌ద్దు
రెండోసారి ప‌ట్టుబ‌డితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా బైకులు న‌డ‌ప‌కూడ‌ద‌ని ట్రాఫిక్ పోలీసులు ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ చాలా మంది నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ న‌డుపుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగితే త‌ల‌కి గాయ‌మై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని తెలిసిన‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యంగా, త‌మ‌కేం కాద‌నే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హెల్మెట్ ధ‌రించ‌డానికి చాలా మంది ఓ అసౌక‌ర్యంగా భావిస్తున్నారు. దీంతో సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధ‌న‌ల‌ను మ‌రితం క‌ఠిన‌త‌రం చేశారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని స్ప‌ష్టం చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే చలానాతో సరిపెట్టబోమని ట్విట్ట‌ర్ లో తెలిపారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి ప‌ట్టుబ‌డితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. దీంతో పాటు ఓ వీడియోను విడుద‌ల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News