Home జాతీయ వార్తలు ఢిల్లీ బార్‌లో మహిళా సిఇఓపై అసభ్య ప్రవర్తన

ఢిల్లీ బార్‌లో మహిళా సిఇఓపై అసభ్య ప్రవర్తన

Drink

 

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఒక ఖరీదైన బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఒక కంపెనీ మహిళా సిఇఓకు కొంతమంది అపరిచిత వ్యక్తుల నుంచి భయంకరమైన అనుభవం ఎదురైంది.గ్రేటర్ కైలాష్ పార్ట్ 2లోని ఎం బ్లాక్ మార్కెట్‌లో ఉన్న సైడ్‌కార్ బార్ అండ్ రెస్టారెంట్‌కు ఒక ఇంటీరియర్ డిజైన్ స్టూడియో సిఇఓ శనివారం రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి వెళ్లారు. ఆ బార్‌లో కూర్చుని ఉండగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. నా వెనుక వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులలో ఒకడు నా కుర్చీపై తన చేయి వేశాడు. అతని చేయి నా తలకు అత్యంత సమీపంలో ఉండడంతో నా కుర్చీని ముందుకు జరుపుకున్నాను. దీంతో నా వెనుక కూర్చున్న అతను కోపంగా నా కుర్చీని ముందుకు తోసాడు. దీంతో నేను ముందుకు తూలిపడ్డాను. నేను లేచి నిలబడి నా కుర్చీని తోసే అధికారం నీకెక్కడిది అని ప్రశ్నించాను.

దాంతో అతను రెచ్చిపోయాడు. కోపంగా నా మీద అరవసాగాడు. తన కాళ్లను అసభ్యంగా చూపుతూ అశ్లీలం పదజాలంతో దూషించసాగాడు. ఆ తర్వాత తన కుడి కాలును నా ముఖం మీదకు సాచుతూ నా కాళ్లను నాకు. నువ్వు నా పనిమనిషిలా ఉన్నావు. మీ దక్షిణ ఢిల్లీ ఆంటీలంతా అంతే అంటూ అసహ్యంగా మాట్లాడసాగాడు. ఇంతలో రెస్టారెంట్ మేనేజర్ వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులను ఫస్ట్ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అయితే మళ్లీ ఐదు నిమిషాలకే వాళ్లిద్దరూ వచ్చేసి మా వెనుకనే కూర్చున్నారు. ఆ తర్వాత దాదాపు అరగంట సేపు మమల్ని వేధించసాగారు. ఇంతలో నా మిత్రురాలు వాళ్లను సెల్‌ఫోన్‌లో ఫోటో తీయడానికి ప్రయత్నించగా అందులో ఒకడు ఆమె వైపు చూస్తూ ముద్దులు విసరసాగాడు. రెస్టారెంట్ మేనేజర్ మాకు ఎంత సహకరించినప్పటికీ వారిని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇంతలో మేము పోలీసులకు కాల్ చేయడంతో వారిద్దరూ అక్కడి నుంచి జారుకున్నారు అని ఆమె వివరించారు. కాగా, ఆ మహిళ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు డిసిపి(సౌత్) అటుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.

Lick My Foot: Woman Alleges Abuse At South Delhi Bar, Case Filed
The incident happened at Sidecar, a restaurant at M Block market in Greater Kailash Part 2 on Saturday night. The woman has posted photos of the men who allegedly misbehaved with them