Saturday, April 20, 2024

దేశంలో రెండేళ్ల ఆయువును తగ్గించిన కరోనా

- Advertisement -
- Advertisement -

ఐఐపిఎస్ అధ్యయనం వెల్లడి

 Life expectancy of Indians has decreased by two years.

 

ముంబై : కొవిడ్ కారణంగా భారతీయుల ఆయుర్దాయం రెండేళ్లు తగ్గినట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ముంబై లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ స్టడీస్ (ఐఐపిఎస్) ఈ అధ్యయనం చేపట్టింది. ఐఐపిఎస్ ప్రొఫెసర్ సూసూర్యకాంత్ యాదవ్ నేతృత్వంలో కరోనాకారణంగా భారతీయుల ఆయుష్సు రెండేళ్ల మేర తగ్గినట్టు వెల్లడైంది. 2019 లో పురుసుల ఆయుర్దాయం 69.5 ఏళ్లు ఉండగా, 2020 నాటికి ఇది 67 ఏళ్లకు పడిపోయిందని నివేదిక వెల్లడించింది. ఇక మహిళల ఆయుర్దాయం రెండేళ్ల క్రితం 72 ఏళ్లుగా ఉండగా, గతేడాది నాటికి 69.8 ఏళ్లకు తగ్గినట్టు పేర్కొంది. దేశ వ్యాప్తంగా జనన, మరణాలపై కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని పరిశీలిస్తూ ఈ అధ్యయనం చేపట్టారు. ముఖ్యంగా 35 69 మధ్య వయస్సులైన పురుషులే ఎక్కువగా మరణించినట్టు అధ్యయనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News