Friday, April 19, 2024

చిన్న చిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు : ఎస్ పి

- Advertisement -
- Advertisement -

జిల్లా ఎస్పీ చందనాదీప్తి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెగాలోక్ ఆదాలత్‌లో సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు కాంప్రమైజ్ చేయించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్న చిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడు కలసిమెలసి ఉండాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం జాతీయ మెగా లోక్ ఆదాలత్ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఫిర్యాది, ముద్దాయి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, జాతీయ మెగాలోక్ ఆదాలత్ ఉన్నందున రాజీ అవకాశం ఉన్న కేసులను లిస్టు ఆవుట్ చేసుకోవాలని జిల్లా కోర్టు కానిస్టేబుల్‌లను ఆదేశించారు. అలాగే నేషనల్ లోక్‌ఆదాలత్ కేసులో కాంప్రమైజ్ అయ్యేటట్లు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు చాలెంజ్‌గా తీసుకొని కేసుల్లో ఉన్న ఇరువర్గాలను కాంప్రమైజ్ చేయించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్‌వారెంట్‌ను ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. అనంతరం రాజీకేసులను తగ్గించడం టార్గెట్‌గా పెట్టుకోవాలని తెలిపారు. పెండింగ్ ఉన్న సీసీనెంబర్లు వెంటనే తీసుకోవాలని సూచించారు.

నాలగు రకాలుగా కేసులను డిస్పోజల్ చేయడం, పోలీస్ డిస్పోజల్ ఈ నాలుగు టార్గెట్‌గా పెట్టుకుని యుఐ ఎంట్రీ యొక్క ఫర్ఫార్మెన్స్‌ను బట్టి, డిజిపి గారు ప్రతినెల రాష్ట్రస్థాయిలో అప్రిసియేషన్ సర్టిపికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు తప్పకుండా కోర్టుకు వెళ్లాలని, నేరస్థులకు పోక్సో, మర్డర్, రేప్, ఇతర గ్రీన్ కేసులలో నేరస్థులకు శిక్షలు పడేలా సాక్షులకు బ్రీఫింగ్ ఇవ్వాలని సూచించారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా విధులు నిర్వహించి కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News