Home చిన్న సినిమాలు ఓ విద్యార్థి జీవిత కథతో…

ఓ విద్యార్థి జీవిత కథతో…

 Students

 

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా ‘బోయ్’. హై స్కూల్ చివరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆష్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్.రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Life of Students in the last days of High School