Wednesday, April 24, 2024

జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Lifting of gates of twin reservoirs

జలాశయాలకు భారీగా వరదనీరు
రెండుగేట్లు రెండు అడుగుల మేర ఎత్తివేత
మూసీలోకి వరద జలాలు విడుదల

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతోంది. ఇటీవల కురిసిన వానలకే జలాశయాలు పూర్తినీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో గురువారం సాయంత్రం హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 678 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 442 క్యూసెక్కుల నీటిని మూసినదిలోకి వదలుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్‌కు 600 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతోంది. ఈసందర్భంగా మూసి నది పరివాహక ప్రాంతాల పట్ల ప్రమత్తంగాఉండాలని వివిధ శాఖల అధికారులకు జలమండలి సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News