Home కామారెడ్డి ఇరుకు వంతెనతో ఇబ్బందులు …

ఇరుకు వంతెనతో ఇబ్బందులు …

 Link roads completed to villages in Kamareddy District

మనతెలంగాణ/దోమకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీరాజ్,ఆర్‌అండ్‌బి శాఖలకు అనేక నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలోని రహదారులను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనుంది. దోమకొండ మండలంలోని అన్ని గ్రామాలలో తారు రోడ్లు,సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం పూర్తయింది. సంగమోశ్వర్ గొట్టిముక్కుల ,లక్ష్మిదేవునిపల్లి, నేషనల్‌ హైవే 44 బిక్కనూర్‌ను కలుపుతూ రోడ్డు నిర్మాణం పూర్తయింది. గ్రామంతో కుందారాం,సంగమోశ్వర్,అంతంపల్లి,దోమకొండ, గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం పూర్తయింది.గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మారుముల గ్రామంగా ఉన్న గొట్టిముక్కుల కామారెడ్డి జిల్లాతో పాటు సిరిసిల్ల,సిద్దిపేట,మెదక్ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉంది. గ్రామం నుండి తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన వేములవాడకు వేళ్లె భక్తులకు దూర భారం తగ్గనుంది.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల గ్రామం మీదుగా మెదక్,సిరిసిల్ల,సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలను కలపే ఎడ్టకట్ట వాగు వంతెనకు రూ.కోటి 12 లక్షలతో నిర్మాణం చేపట్టేందకు గత సంవత్సరం మార్చ్‌నెలలో ప్రభుత్వ విప్,కామారెడ్డి ఎంఎల్ఏ గంప గోవర్దన్ చేతుల మీదుగా పనులను ప్రారభించారు. అదే సంవత్సరం బ్రిడ్జి పనులు ప్రారంభం కావాలసినప్పటికి కాంట్రాక్టర్ నిర్లక్షంతో పనులు నత్తతో పోటి పడుతున్నాయి. ఈ విషయం ఎంఎల్ఏ దృష్టికి వెళ్లటంతో కాంట్రాక్టర్‌ను మందలించినట్లు సమాచారం. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురిసినట్లయితే ఈ సవత్సరం పూర్తికాదని స్తానికుల అభిప్రాయం.నేషనల్ హైవేపై టోల్‌ప్లాజ ఉండటంతో భారీ వాహనాలతో పాటు లైట్‌మోటర్ వాహనాలు టోల్ తప్పించుకునేందుకు ఇక్కడి దారి నుండే వెళుతున్నాయి.దీంతో బిక్కనూర్ సిఐ పరిధిలోని పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశారు. అన్ని గ్రామాలలో సిసి కెమోరాలు ఉన్నప్పటీకి బిక్కనూర్ మండలం లక్ష్మిదేవునిపల్లికి చేందిన మహిళ రైతు తన పోలంలో పనులు చేసుకుంటుండగా ద్విచక్ర వాహనంపై మహిళతో పాటు దుండగుడు వచ్చి మహిళ రైతు మెడలోని బంగారం దోచుకుని మహిళను తీవ్రంగా గాయపర్చి తప్పించుకున్నారు. దీంతో పోలీసులు ఈ దారివెంట నిఘాను పెంచారు. గ్రామం మీదుగా రవాణా పేరగటంతో ఇరుకు బ్రిడ్జితో ఇబ్బందుల పాలవుతున్నామని స్తానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.