Friday, April 26, 2024

ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానానికి మార్చి 31 గడువు

- Advertisement -
- Advertisement -

PAN-with-Aadhaar

న్యూఢిల్లీ: మార్చి 31వ తేదీ లోగా తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17 కోట్లకు పైగా పాన్ కార్డులు చెల్లుబాటు కాకుండా పోతాయి. 2020 మార్చి 31వ తేదీ లోగా పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్)ను ఆధార్‌తో అనుసంధానించని పక్షంలో అవి పాన్ కార్డులు చెల్లుబాటు కావని ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది. పాన్, ఆధార్ అనుసంధానం కోసం గతంలో పలుమార్లు గడువు విధించారు.

కాగా, తాజా గడువు మార్చి 31వ తేదీతో ముగియనున్నది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటికే 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. అయితే మరో 17.58 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం జరగవలసి ఉంది. ఆధార్ రాజ్యంగపరంగా చట్టబద్ధమైనదని, ఐటి రిటర్న్‌ల ఫైలింగ్‌లో, పాన్ కార్డుల జారీలో ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా చేర్చాలని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

Linkage of PAN with Aadhaar deadline ends on March 31, over 17 cr PAN cards to become inoperative if not linked from April 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News