Home ఆఫ్ బీట్ వీడియోలు ఆ సింహం గడ్డి తింటోంది…. (వీడియో)

ఆ సింహం గడ్డి తింటోంది…. (వీడియో)

Lion

 

గుజరాత్: సింహం అంటేనే మాంసహారి… సింహం తన జీవిత కాలంలో మాంసం తినే బతుకుతుంది. కానీ గుజరాత్ రాష్ట్రం గిర్ అటవీ ప్రాంతంలోని తులసి శ్యామ్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తిన్నది.  సింహం మాంసానికి బదులుగా గడ్డి తింటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడవికి మృగరాజైన సింహం ఆకలితో అలమటించి గడ్డి తింటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాంసం తిని తిని సింహానికి బోర్ కొట్టి శాకాహారిగా మారినట్టుందని చలోక్తులు విసురుతున్నారు. సింహం గడ్డి తినటమేంటని  సోషల్ మీడియా యూజర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కడుపు కాలితే గుర్రం కూడా వరి గడ్డి మేస్తుందనే సామేత సింహానికి వర్తిస్తుందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు భారత దేశంలో వివిధ కారణాలతో 200 సింహాలు వరకు మృతి చెందాయని గణాంకాలు చెబుతున్నాయి.  

Lion Eating Gross in Gir Forest in Gujarath

 

Lion Eating Gross in Gir Forest in Gujarath