Friday, April 26, 2024

మద్యపాన నిషేధం అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి
మహిళలపై జరిగే ఆకృత్యాలను, హత్యా చారాలను, గృహహింసను అరికట్టాలి
బిసిమహిళ సంఘాల సమావేశం డిమాండ్

హైదరాబాద్ : సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని, పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి చట్ట సభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బిసిమహిళల కు రాజ్యాధికారం దక్కుతుందని ఆయనన్నారు. సోమవారం బిసి మహిళల సమావేశం బిసి భవన్‌లో జరిగింది. జాతీయ బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు డా. ఎ. పద్మ లత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రామకృష్ణ, సి. రాజేందర్, అంజి ప్రసంగించారు.

తదితరులు ప్రారంభించారు. పార్లమెంటులో ప్రవేశపెట్లే మహిళా బిల్లులో బిసి మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని ఆయన కోరారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బిసి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు.

మహిళ బిల్లు పాస్ కావాలంటే బిసి మహిళలకు సబ్ -కోటా ఇవ్వక తప్పదని అన్నారు. జనాభాలో సగం ఉన్న బిసి మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు. మహిళ బిల్లులో రాజకీయ రిజర్వేషన్ల తో పాటు విద్యా – ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు మహిళల రక్షణ కోసం ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నా వారిపై అత్యాచారాలు తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విదించినపుడే మహిళా ప్రగతి జరుగుతుందని ఆర్ కృష్ణయ్య చెప్పారు.

మద్యపానాన్ని నిషేదించాలని అందులో మొదటి దశలో బెల్టుషాపులు ఎత్తివేయాలని జాతీయ రహదారులు ప్రధాన పక్కన ఉన్న మద్యం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాత్రి ఏడు గంటల తర్వాత మద్యం దుకాణాలు మూసి వేయాలని కోరారు ముఖ్య మంత్రి కెసిఆర్ స్పందించి మద్యపాన నిషేధం ప్రకటించాలని కోరారు. ఈ సమావేశానికి ఎర్ర సత్యనారాయణ, వేముల రామ కృష్ణ, సి. రాజేందర్, అంజి, అనంతయ్య, నాని ముదిరాజ్, కుమార్ యాదవ్, సత్తిబాబు, జిపిటి కుమార్, పెంకె. శ్రీనివాస్, పి. భూషణం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News