క్వార్టర్ బాటిల్‌కు రూ.10
పెంపు, రూ.40 పెరగనున్న
ఫుల్ బాటిల్ ధర ఆదివారం
అర్ధరాత్రి నుంచే అమలులోకి
రూ.350 కోట్ల అదనపు
ఆదాయమే లక్షం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రిసోర్స్ మోబలైజేషన్ లో భాగంగా మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీ సుకుంది. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆబ్కారీ శాఖ జారీచేసింది. విస్కీ, బ్రాందీ బ్రాండ్‌ల పైనే ప్రభుత్వం ధరల పెంపుదల నిర్ణయం ఉండనుంది. క్వార్టర్ బాటిల్‌పైన రూ.10లు, హాఫ్ బాటిల్ పైన రూ.20లు, ఫుల్ బాటిల్‌పైన రూ.40ల చొప్పున ధరల పెంపుదల అమలులోకి రా నున్నది. ఇదిలా ఉండగా, పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా సే వించే చీప్ లిక్కర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మద్యంప్రియులకు మద్యం ధరల పెంపు భారం కాకుండా న్యా యబద్దంగా క్వార్టర్ బాటిల్ పైన కేవలం రూ.10ల పెంపుదలకే ప్ర భుత్వం పరిమితం అయ్యిందని ఆబ్కారీ అధికారి ఒకరు తెలిపారు.
అదనపు ఆదాయం రూ.350 కోట్లు
మద్యం ధరల పెంపకం ద్వారా ఆబ్కారీ శాఖకు నెలకు రూ.350 నుంచి రూ.400 కోట్ల మేరకు అదనపు ఆదాయం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆబ్కారీ గణాంకాల మేరకు ఏడాదికి 369 లక్షల మద్యం కేసులు అమ్ముడవుతున్నాయి. ధరల పెంపుదల మద్యం విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపదని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల పెరిగిన బీర్ల ధరలు
గత నెలరోజుల క్రితం ఆబ్కారీ శాఖ బీర్ల ధరలను రూ.30ల చొప్పు న పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి నెల రూ.150 నుంచి రూ.200 కోట్ల మేరకు బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడాదికి 561లక్షల కేసుల బీర్ల కేసులు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల పెంచిన బీర్ల ధరల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూకపోగా ఈసారి వేసవిలో అంచనాలకు మించి బీర్ల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.