Home తాజా వార్తలు తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు…?

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు…?

liquorహైదరాబాద్  : తెలంగాణలో శుక్రవారం నాడు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. రెండేళ్ల కాలపరిమితితో ఈ కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే త్వరలోనే మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2,216  దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 19 డిపోల ద్వారా ఈ మద్యం దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తారు. కొత్త మద్యం విధానంతో ప్రభుత్వానికి లైసెన్సుల రూపంలో రూ. 1467 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచి మరింత ఆదాయం పొందాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఎపిలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో మద్యం ధరలను 15 నుంచి 20 శాతానికి పెంచారు. ఎపి తరహాలోనే తెలంగాణలో కూడా మద్యం ధరలను పెంచాలన్న ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అంతేకాదు మద్యం దుకాణాల నిర్వహణకు ఎవరూ ముందుకు రాని ప్రాంతాల్లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మద్యం దరలను పెంచొద్దని మద్యం ప్రియులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Liquor Prices To Rise In Telangana