Friday, April 19, 2024

ఆబ్కారీ శాఖకు ‘కొత్త’ జోష్

- Advertisement -
- Advertisement -

Liquor revenue from Rs 130 to Rs 150 crore in a single day

డిసెంబర్ చివరిరోజు రూ.130 నుంచి 150కోట్ల ఆదాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖకు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల ఆదాయం భారీగా తెచ్చిపెడుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శుక్రవారం ఒక్కరోజే రూ.130 నుంచి రూ.150 కోట్ల ఆదాయం సమకూరినట్టుగా ఆబ్కారీ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ నెలలో రూ.3500 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. శుక్రవారం 40 లక్షల మద్యం పెట్టెలు, 39.80 లక్షల బీరు పెట్టెలు అమ్ముడయినట్టుగా ఆబ్కారీ శాఖ తెలిపింది. 500ఈవెంట్ నిర్వాహకులకు అనుమతి రాష్ట్రవ్యాప్తంగా నూతన ఏడాది వేడుకలను రాత్రంతా జరుపుకునేలా, మద్యం అందుబాటులో ఉంచుతూ న్యూ ఇయర్ వేడుకలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అనుమతులు జారీ చేయడం ఆదాయం అధికంగా రావడానికి ఒక కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఆబ్కారీ శాఖ తాత్కాలిక లైసెన్సులు జారీ చేసింది. అయితే ఈవెంట్‌లలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి కనీస ఫీజు రూ.50 వేలు కాగా, అత్యధికంగా రూ.2.50 లక్షలు తాత్కాలిక ఫీజు కింద ఆబ్కారీ శాఖ వసూలు చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 500ల మంది నిర్వాహకులు ఈవెంట్‌లను నిర్వహించుకోవడానికి ఆ శాఖ అనుమతులు ఇచ్చినట్టుగా తెలిసింది. 2016 డిసెంబర్‌లో రూ.1,399కోట్లు, 2017లో రూ. 1,644కోట్లు, 2018లో రూ. 1,961కోట్లు, 2019లో రూ.2,046కోట్లు, 2020లో డిసెంబర్ నెలలో రూ.2,765 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా , 2021 సంవత్సరం డిసెంబర్‌లో రూ.3500 కోట్ల ఆదాయాన్ని ఆబ్కారీ శాఖ ఆర్జించింది. 2021లో కొత్తగా 404 మద్యం దుకాణాలు, 159 బార్లకు అదనంగా అనుమతులు జారీ చేయడంతో విక్రయాలు మరింత పుంజుకున్నాయి. దీంతో ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా 20 శాతంపైగా విక్రయాలు పెంచుకునేందుకు ఆబ్కారీ శాఖ ప్రణాళికలు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News