Saturday, April 20, 2024

ఖజానాకు సూపర్ కిక్

- Advertisement -
- Advertisement -

Liquor sales have increased in Telangana

హైదరాబాద్: మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. అమ్మకాల్లో ఏ మాత్రం జోష్ తగ్గడం లేదు. గత ఆర్థిక కంటే ఈసారి ప్రభుత్వానికి మద్యంపై ఎక్కువ ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మ కాల ద్వారా ప్రభుత్వం రూ.27,288.72 కోట్ల ఆదా యం ఆర్జించింది. ఇది 2019-2020 ఆర్థిక సంవత్స రంతో పోల్చితే రూ.4,682.81 కోట్లు ఎక్కువని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2019-2020లో మ ద్యం అమ్మకాల విలువ రూ. 22,605.91 కోట్లుగా ఉం ది. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు చా లా రోజులు మూతపడ్డాయి.

మద్యం అమ్మకాలు తగ్గినా మద్యం రేట్లు పెంచడంతో భారీగా ఆదాయం ప్రభుత్వా నికి సమకూరింది. 2019-20తో పోల్చితే 202021 లో 13,33,377 లిక్కర్ కేసులు, 2 కోట్ల 18 లక్షల 93 వేల బీరు కేసులు అమ్ముడుపోయాయి. 2020-21లో 3 కోట్ల 35 లక్షల 49 వేల 811 లిక్కర్ కేసులు అమ్ము డుపోగా, 2 కోట్ల 73 లక్షల 32 వేల 828 బీరు కేసుల విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. అమ్మకా లు తగ్గినా ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని అధి కారులు పేర్కొంటున్నారు మరోవైపు కరోనా సమయం లో బీర్ల డిమాండ్ తగ్గి క్రమంగా లిక్కర్ అమ్మకాలు పెరి గిపోయాయని ఎక్సైజ్ బట్టి తెలుస్తోంది.

గతేడాది ఏప్రిల్ 1 నుంచి..

గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. ఇందులో వ్యాట్ పోగా రూ.15 వేల కోట్లకు పైగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చింది. ఇక లిక్కర్ బాటిళ్ల వారీగా చూస్తే 11 నెలల కాలంలో 2.4 కోట్ల కే సుల బీర్లు, మూడు కోట్ల కేసులకుపైగా లిక్కర్ విక్రయా లు నమోదు కావడం గమనార్హం.

46రోజుల పాటు ఆగిపోయినా..

కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. 2020-, 21 ఆర్థిక సంవత్స రానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడుల కింద రూ.16 వేల కోట్లు సమకూర్చుకో వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అనుకున్న దాని కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆబ్కారీ శాఖ సమకూర్చు కుంది. గతేడాది లాక్‌డౌన్ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జర గలేదని, ఆ సమయంలో వైన్‌షాపులు, బార్లు తెరిచి ఉం టే మరో 2వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చేదని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. మొత్తంమ్మీద జీ ఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్లు వంటి కీలక రంగాల నుంచి ఆదాయం తగ్గినా మద్యం రాబడి పెరగడంతో ఖ జానా కళకళలాడుతోంది.

మార్చిలో పెరిగిన విక్రయాలు

రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్ తాగేశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్, 2.4 కోట్ల కేసులకుపైగా బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో లిక్కర్ కేసులో 9 లీటర్ల మ ద్యం, బీరు కేసులో 7.8 లీటర్ల బీరు ఉంటుంది. ఈ లెక్కన 334 రోజుల్లో మందుబాబులు, లిక్కర్, బీర్ల కలి పి రోజుకు 14 లక్షల లీటర్ల వరకు తాగారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్ అమ్ముడుపోగా వీటి విలువ రూ. 2,727 కోట్లుగా తేలింది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండ డం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News