Friday, April 19, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జిషీట్.. ఎమ్మెల్సీ కవిత భర్తపై అభియోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం కుంభకోణం కేసులో ఇడి మూడో సప్లిమెంటరీ ఛార్జిషీటును దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మొత్తం నాలుగు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. తాజా ఛార్జిషీటులో బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కవిత, ఆమె భర్త అనిల్ పైన ఇడి కీలక అభియోగాలు మోపింది. కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. ఈ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ ది కీలక పాత్ర అని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సౌత్ గ్రూప్‌కు లాభం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. లిక్కర్ వ్యవహారంలో అరుణ్ పిళ్లై కవితకు ప్రతినిధిగా వ్యవహ రించినట్లు పేర్కొన్నది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాల ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నట్లు పేర్కొంది.

ఫీనిక్స్ ద్వారా భూములు కొన్నట్లు పేర్కొంది. తాజా ఛార్జిషీటులో ఫీనిక్స్ శ్రీహరి, కవిత భర్త అనిల్ పేర్లను ప్రస్తావించింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై అందులో పేర్కొంది. శ్రీహరి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొంది. శ్రీహరి నుండి కవిత 25వేల చదరపు అడుగుల స్థలం కొన్నట్లుగా ఉందని పేర్కొంది. మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువ మొత్తం చెల్లించి కవిత కొన్నట్లుగా అందులో పేర్కొన్నారని తెలుస్తోంది. ఇక ఎన్ గ్రోత్ క్యాపిటల్‌లో అనిల్ భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొంది. మాగుంట శ్రీనివాసులు, రాఘవపై అభియోగాలు చేసింది. ఈ స్కాంలో సూత్రదారులు, పాత్రదారులకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మే 10న జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News