Home తాజా వార్తలు లక్కు మిస్… డబ్బులు ఉష్

లక్కు మిస్… డబ్బులు ఉష్

liquor

మొన్న పోటా పోటీగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు
నేడు లబోదిబోమంటున్న వ్యాపారులు
బాబ్బాబు గుడ్ విల్ ఇస్తా దుకాణం ఇవ్వవా ప్లీజ్

అయ్యాయో చేతుల డబ్బులు పోయెనే..ఇది ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా వినిపిస్తున్న పాట….ఇద్దరు మద్యం వ్యాపారులు కలసి పాతిక దుకాణాలకు టెండర్లు వేస్తే కనీసం నలుగైదు ఐన రాకపోతాయని చూస్తే లాటరీలో ఒక్కటి రాకపాయె…నలుగురు మి త్రులు కలసి 40 లక్షలు పెట్టి 20 మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేసిన లాటరీలో ఒక్కటంటే ఒక్క దుకాణం దక్కలేదు…చేతి బదులు, అప్పులు చేసి దరఖాస్తు లు సమర్పించిన చాలా మంది ఇప్పుడు వాటిని ఎలా తీ ర్చాలి అన్న దానిపై మదనపడుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడ చూసిన మద్యం దుకాణాల ఎవరికి వచ్చాయనే చర్చ జోరుగా సాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో 195 దుకాణాలకు 4863 దరఖాస్తులు వచ్చాయి. 4863 దరఖాస్తులలో కేవలం 195 మందిని లాటరీలో గుర్తించడం తో మిగతా 4668 మంది లో చాలా మం ది ప్రస్తుతం లబోదిబో మంటున్నా రు. మేడ్చల్‌లో 181 దుకాణాలకు 3187, వికారాబాద్‌లో 46 దుకాణాల కు 683 మంది దరఖాస్తులు చేసుకోగా లాటరీలో దుకాణం వచ్చిన సంతోషంతో సంబరాలు చేసుకుంటుండగా లక్ లేక కిక్ లేక మిగత వారు దిగాలుగా పరేషాన్‌లో కనబడుతున్నారు. మద్యం వ్యా పారంలోకి అడుగుపెట్టి కోట్లు సంపాదించడంతో పాటు సంఘంలో పరపతి పెం చుకుందామన్న ఆశతో అనేక మంది దరఖాస్తులు చేసుకున్న దుకాణం రాక చే తులు ఉన్న డబ్బులు పోయి ప్రస్తుతం ల బోదిబో మంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సిండికేట్‌లు మారిన అనేక మంది దరఖాస్తుల కోసం లక్షలు ఖర్చు పెట్టిన ఒక్క దుకాణం అయినా దక్కితే కనీసం గౌరవం ఉంటుందని ఆశీంచారు.

గుడ్ విల్ ఇస్తాం…దుకాణం ఇవ్వండి….బేరసారాలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకు న్న వ్యాపారులకు ప్రస్తుతం మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఎ ళ్ల తరబడి మద్యం వ్యాపారం నిర్వహిస్తు తమ ప్రాంతంలో మంచి పలుకుబడి సాధించిన వ్యాపారులకు చాలా మందికి ప్రస్తుతం దుకాణాలు దక్కకపోవడంతో దుకాణాలు దక్కిన వ్యాపారుల నుంచి గుడ్ విల్ ఇచ్చి దుకాణాలు తీసుకోవడంపై దృష్టిసారించారు. శుక్రవారం లాటరీలో దుకాణాలు దక్కిన వారిలో సీమాంద్ర ప్రాంతానికి చెందిన వారు చాలా మంది ఉండటంతో వారి నుంచి దుకాణాలను తీసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు ప్రారంబించారు. టెండర్ల దాఖల కు ఖర్చు చేసిన మొత్తం డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామ ని కొంత మంది ప్రతిపాధనలు పెడుతుండగా మరికొంత మంది బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

లాటరీలలో దుకాణాలు దక్కించుకున్న కొంత మంది వ్యాపారులు ఇప్పటికే తమ పేరుతో దుకాణం నడిపించుకుని తమకు లాభంలో వాటాలపై చర్చించుకుని ముందుకు సాగుతున్నారు. నవంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు నడిపించుకోవడానికి అవకాశం ఉండటంతో అలోపు దుకాణాం కోసం స్థ లం, తదితర సౌకర్యాలను సమకూర్చుకోవలసి ఉండటంతో వ్యాపారులు అందివచ్చిన అవకాశంను వాడుకుంటున్నారు. రెండు, మూడు రోజులలో దుకాణాలు దక్కించుకున్న వారు చాలా మంది గుడ్ విల్ తీసుకుని తమ దుకాణాలను ఇతరులకు అప్పగించే అవకాశాలున్నాయి.

Liquor shop tender in Telangana