Home తాజా వార్తలు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్

రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్

Liquor Shops Closed For Two Days In Hyderabadహైదరాబాద్ : పాతబస్తీ బోనాల పండుగ నేపథ్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లను మూసివేయనున్నట్టు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆది,సోమవారాల్లో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని వారు ఆదేశాలు జారీ చేశారు. బోనాల పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు ధిక్కరించి మద్యం, కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.