Home తాజా వార్తలు రేపు మద్యం షాపులు బంద్

రేపు మద్యం షాపులు బంద్

Liquor Shopsహైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించే మద్యం దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పక్కా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు సూచించిన రూట్లలోనే వాహనదారులు వెళ్లాలని వారు చెప్పారు.

Liquor Shops Closing On Tomorrow