- Advertisement -
మనతెలంగాణ/ డిచ్‌పల్లి : తెలంగాణ విశ్వవిద్యాలయం లో ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాంబాబు గోపిశెట్టి ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 4కు చెందిన విద్యార్థులకు శనివా రం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సమావేశ మందిరంలో వివిధ సాహిత్య, సాంస్కృత్రిక పోటీలు నిర్వహించారు. యూనిట్4 విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డిబెట, క్విజ్, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, బృందనృత్యం, పాటలపోటీలు, రంగోళి తదితర మొదలైన సాహిత్య సాంస్కృత్రిక పోటీలు నిర్వహించారు. యూనిట్ 4 విద్యార్థులకు సాహిత్య, సాంస్కృత్రిక పోటీలు నిర్వహిం చి యూత్ పెస్టివల్‌కు సంసిద్ధ్దం చేయడంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. జి. రాంబాబు గోపిశెట్టి చూపుతున్న శ్రద్ధను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి. సాంబయ్య, రిజిస్ట్రార్ కె. శివశంకర్, కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణాబాయి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
- Advertisement -