Home తాజా వార్తలు సాహిత్యం ఉన్నంత వరకు సినారె ఉంటారు

సాహిత్యం ఉన్నంత వరకు సినారె ఉంటారు

 Singirareddy Narayana Reddy

 

సాహిత్యాభిమానులు భాషాభివృద్ధికి కృషి చేయాలి,  వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగిన సాహితీ శిఖరం సినారె అని తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సినారె జయంతి ఉత్సవ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో వనపర్తిలోని పద్మావతి గార్డెన్‌లో నిర్వహించిన సినారె జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహించిన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కవిగా, గేయరచయితగా సినారె ఎంతటి ప్రసిద్దుడో ఆచార్యులుగా కూడా ఆయన అంతే ప్రసిద్దులని సినారె మీద అభిమానంతో జయంతి ఉత్సవాలను నిర్వహించామని నిరంజన్‌రెడ్డి అన్నారు.

నేటి కాలంలో విద్యార్థులు తెలుగుభాషా ఉచ్చారణ, భాషా దోషాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని సరిదిద్దే ప్రయత్నం మనమంతా చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. భాషాభిమానులు, సాహిత్యాభిమానులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారన్నారు. సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు తెచ్చారన్నారు. హైద్రాబాద్‌కు పరిమితమైన సాహిత్య సభలు వనపర్తిలో నిర్వహించడంపై వారు అభినందించారు.

ఆకట్టుకున్న కవి సమ్మేళనం..
ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన రచయితలు పాల్గొన్నారు. కవి సమ్మేళనానికి డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా డా. నర్సింహారెడ్డి, రఘు, మోహన్, సాహిత్యంపై ప్రసంగించారు. కవి సమ్మేళనంలో ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఆచార్య ఎస్‌వి రామారావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి మాడ హరికృష్ణ, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి చెన్నయ్య, జడ్పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, సినారె కుటుంబ సభ్యులు అయిలయ్య, గోరటి వెంకన్న, సూర్య ధనుంజయ, డా. కోటేశ్వర్‌రావు, ఉత్సవ కమిటి అధ్యక్షులు డా. జయంతి, డా. వీరయ్య, సుబ్బయ్య, బీంపల్లి శ్రీకాంత్, గోపి, సినారె పరిశోధన చేసిన పరిశోధకులను సన్మానించారు.

Literary peak is Singirareddy Narayana Reddy