Home ఎడిటోరియల్ సాహిత్య ఒయాసిస్సులు

సాహిత్య ఒయాసిస్సులు

క్షణం తీరిక ఉండని మహానగర జీవితంలో సృజనశీలురు, అక్షర కృషీవలులు ప్రతి రోజూ, వారానికోసారి, నెలనెలా నిర్ణీత ప్రదేశంలో తలలు చేర్చి తమ కలాల సృష్టి మృష్టాన్నాలతో పరస్పరం విందు చేసుకోవడం, ఆ క్రమంలో ఆ మహా సంగమాలు కొత్త రచయితలను, కవులను తయారు చేసే అక్షర కార్ఖానాలుగా వర్ధిల్లడం ఎంత గొప్ప విషయమో చెప్పనక్కర లేదు. హైదరాబాద్ నగరంలో అటువంటి గొప్ప సందర్భాలను పుష్పించి, పండించి సాహిత్య సుమ సౌరభాలు వెదజల్లుతున్న గొప్ప కవులు, రచయితల కొలువుల గురించి వాటి నిర్వాహకులైన సాహిత్య ప్రముఖుల నుంచే తెలుసుకుందాం – 

న్యూవేవ్ రైటర్స్

 డి.వెంకట్రామయ్య

poetప్రజల్లో అధిక సంఖ్యాకుల మేలు కోరే వ్యవ స్థను ఏర్పరచటానికి అవసరమైన అవగాహననీ, చైతన్యాన్నీ పాఠకుల్లో కలిగించటానికి సాహిత్యం ఒక ఆయు ధంగా భావించాం. వృత్తిరీత్యా ఆలిం డియా రేడియో హైదరాబాద్ కేంద్రం లో జర్నలిస్టుగా, అనౌన్సర్‌గా ఉన్న నేను, నా భావాలకు సరిపోయే మిత్రులను కూడగట్టాను. 1969 నుండి 1980 వరకు పదేళ్ళకు పైగా ప్రతి ఆదివారం మా ఇంట్లో కలిసే వాళ్ళం. అప్పడు మా ఇల్లు నారా యణగూడలోని విఠల్‌వాడిలో ఉండేది. అందుకే మమ్మల్ని నారాయణగూడ రచయితలు అనీ, న్యూవేవ్ రైటర్స్ అనీ పిలిచేవాళ్ళు.
నేను, చంద్ర (ఆర్టిస్టు), శ్రీపతి, వి.రాజారామ్మో హన్‌రావు, సి.ఎస్. రావు, ముప్పిడి ప్రభాకర రావు, భైరవయ్య, పి.వి.ఆర్. శివకుమార్, కొంపెల్ల విశ్వం, పి. శ్రీనివాస శాస్త్రి వీళ్ళంతా క్రమం తప్పకుండా వచ్చే వాళ్ళు. ఆధునిక సాహిత్యం – ధోరణులపై చర్చించే వాళ్ళం. ముఖ్యంగా కథానికా సాహిత్యంపై ఎక్కువ చర్చలు జరిగేవి. వారం వారం వాళ్ళు రాసిన కథల్ని చదివి వినిపించే వాళ్ళు. వాటిపై వివిధ కోణాల్లో చర్చించి, మంచిచెడులను విశదీకరించే వాళ్ళం. అట్లా మెరుగైన కథా సాహిత్యం రాయడానికి తోడ్పాటయ్యేది. వి.వి.అశోక్, పురాణం శ్రీనివాస శాస్త్రి లాంటి జూనియర్స్ మంచి కథకులయ్యారు.
ఎప్పుడూ మేమే కాకుండా కొత్త దనం కోసం అప్పుడప్పుడు పేరు మోసిన రచయితల్ని కూడ ఆహ్వా నించేవాళ్ళం. అట్లా వచ్చిన వారిలో కాళీపట్నం రామారావు, చాసో, బలివాడ కాంతా రావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, త్రిపుర, బి.శివాజీ రావు లాంటి వాళ్ళు ముఖ్యులు. విరసం రైటర్స్ కూడా ఒక్కోసారి వచ్చేవాళ్ళు. బి.నర్సింగ రావు, వర వరరావు మాతో కలిసి చర్చించే వాళ్ళు. గద్దర్ ఒకసారి మా సమా వేశానికి వచ్చి తన పాటల్ని వినిపిం చాడు. అప్పట్లో ‘హోరు’, ‘జనం’, ‘కథ’ పేర్లతో 3 సంకలనాల్ని తెచ్చాం. అవి సంచలనాల్ని సృజించాయి.
ఎమర్జెన్సీ కాలంలో మాపై పోలీసుల నిఘా పెరిగింది. మా ఇంటిపై, చంద్ర, సి.ఎస్.రావు ఇండ్లల్లో సోదాలు చేశారు. మా దగ్గరేముంటాయి. కొన్ని పుస్తకాల్ని మాత్రం తీసుకెళ్ళారు.
అయినా మా పని మేం చేసుకుంటూనే పోయాం, కొత్త రచయితల్లో ప్రయోజనకరమైన ఇతివృత్తం, పదునైన భాష, అరుదైన శిల్పం పాదుకొల్పటానికి ప్రయ త్నించాం. మా ఉద్యమాన్ని గురించి పత్రికా ప్రకటనల ద్వారా తెలుసుకున్న కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ లాంటి వారు వారు రాసిన వ్యాసాల్లో మా న్యూవేవ్ రైటర్స్ కార్యక్రమాల్ని ఉటంకించారు.

నెలనెలా వెన్నెల

సి.వి. కృష్ణారావు  

‘నెలనెలా వెన్నెల’ నా ఒక్కడి ఆలోచనే కాదు. కీ.శే.పి.ఎన్. స్వామి, హరి చంద్ర శేఖర్, కలగా వెంకట సుబ్బా రావు, నగ్నముని, నేను రూపొందిం చాం. 1982 ఆగస్టు రెండు బుధ వారం నాడు ప్రారంభించాం. మొదటి నాలుగు సంవత్సరాలు నెలకోసారి ఒక్కొక్క సభ్యుని ఇంట్లో జరిగేవి. తర్వాత శ్యాంనగర్ అంజయ్య ఆడిటో రియంలో, ఆ తర్వాత ఆ స్మాగడ్ డా॥మోహన్‌రావు ‘నయావరణ్’ భవ నంలో చివరికి చైతనపురిలో జరి గాయి. కవులు, రచయితలు తమ తమ రచనల్ని రాసుకుని వచ్చేవాళ్ళు. తోటి వారి ముందుం చితే, మెచ్చుకోళ్లు – చర్చలు జరిగేవి. రచయితకు తృప్తి కలిగేది. అన్ని రకాలుగా వచ్చేవాళ్ళు కాబట్టి అన్ని కోణాల్లో చర్చలు జరిగేవి. అలా కవులు, కథకులు, చిత్ర కారులు, గాయకులు అందరూ పాల్గొనేవారు. వేయి పుష్పాలు వికసిం చనీ, వేయి మేధస్సులు రాణించనీ అనేదే మా వేదిక లక్షం. అందరూ సౌభ్రాత్వంతో, దిదృక్షతో పాల్గొనేవారు. అట్లా 28 ఏళ్ళు నిర్విఘ్నంగా నడిపాం. మా ‘నెలనెలా వెన్నెల’ లో వందలాది మంది పెద్ద – చిన్న రచయితలు – కవులు పాలొ ్గన్నారు. అట్లా పాల్గొన్న ప్రముఖులలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ సి.నా.రె, బాలాంత్రపు రజనీ కాంతారావు, ప్రఖ్యాత ఒరియా రచయిత జయంత్ మహాపాత్ర, డా॥ వి.వి. రామనాథం (న్యూజెర్సీ) కాళోజీ నారాయణరావు, దాశ రథి రంగాచార్య, వసంత కన్నాభిరాన్, రాంభట్ల కృష్ణ మూర్తి, ఆచార్య కోవెల సంపత్కుమాచార్య, అద్దేపల్లి రామ్మోహన్ రావు, ముకురాల రాంరెడ్డి, పొత్తూరి వెంక టేశ్వరరావు, కేశవరెడ్డి, పోలూరి ఆంజనేయప్రసాద్, నందివాడ భీమారావు ఇట్లా ఎన్నని పేర్లు చెప్పాలి. దాదాపు తెలుగు సాహిత్య కారులందరూ పాల్గొనా ్నరు. మేం నిర్వహించిన గుర్తున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్ని చెప్పాలి.
31, జులై 1989 నాడు ‘కవితా శిబిరం’ పేరిట ఉదయం 10 గం॥ల నుండి రాత్రి దాకా పద, పద్య, గేయ రచనల మీద గోష్ఠిని నిర్వ హించాం. అప్పుడు వేటూరి ఆనంద మూర్తి, జూలూరి హనుమంతరావు, ముది గొండ వీరభద్రయ్య గారలు పాల్గొ న్నారు. అట్లే 24 జూన్ 1990 రోజు రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ హాలులో ‘కవి సమయం’ పేరిట ఒక విశిష్ట కార్యక్రమం చేశాం. 21 మంది కవులు తమ కవితల్ని వారి పేర్లు లేకుండా రచన మాత్రమే కాపీలు తీయించి సభ్యులకు సమావేశం ముందే ఇచ్చాం. వాటిని శ్రోతలు చర్చించారు. అజ్ఞాతంగా వుండి తమ రచనల్ని ఎలా స్వీకరిసా ్తరోనని అహం దాచుకొని చెవులప్పగించి విన్నారు. అదొక ప్రత్యేకా నుభవ కార్యక్రమం. వర్తమాన కవితా రీతులు, ఆధునిక అత్యాధునికత, స్త్రీ వాదం, దళిత వాదం, అభ్యుదయ, విప్లవ వాదాలు, దార్శనికత, ఒకటేమిటి కావ్య సృష్టికి సంబంధించిన ప్రతి విషయంపై అధ్యయనం చేశాం. అనేక పుస్తకాలపై చర్చలు జరిపాం. కొన్ని సార్లు రమణ -సుమనశ్రీల పేరిట సుమనశ్రీ కొందరిని సత్కరిం చారు. సిద్ధార్థ, వై. ముకుంద రామారావు, మెహజబీన్, పసునూరి శ్రీధర బాబు, వాడ్రేవు చిన వీరభద్రుడు ఈ అవా ర్డును అందుకున్నారు.
వ్యక్తిగతంగా నేను వైతరణి, మాదీ నీవూరే మహా రాజకుమారీ, అవిశ్రాంతం, కిల్లారీ (లాతూర్ భూకంపం చూసి రాసింది) మీకు తెలిసినవే. అట్లాగే సంస్థ పక్షాన ‘నెలనెలా వెన్నెల’ పేరిట ఐదు, 1985, 1990, 1993, 2001, 2010 సంవత్సరాల్లో తెచ్చాం. వాటికి మంచి స్పందన పాఠకుల నుంచి వచ్చింది.

ఇదిగో ద్వారక…

కె.శివారెడ్డి 

నేను హైదరాబాద్‌కు 1966లో వచ్చాను. అప్పు డు నాకిక్కడ ఎవరూ పెద్ద గా పరిచయం లేరు. నాది కాంప్లెక్స్ క్యారెక్టర్ ఒక ఇంట్రావర్డ్ క్యారెక్టర్. లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తికి ఉండే అవలక్షణాలన్నీ ఉన్న వాడిని. బిడియం, సంకో చం, టచ్‌మినాట్ అన్నట్లుం డడం అప్పటి నా వ్యక్తి త్వం. ఐతే వాటి నుంచి దూరమై సాహిత్య కారులకు దగ్గరయ్యే మార్గంగా ద్వారకా సమావేశం ఏర్పాటుచేశాను. అక్కడే ఎందుకంటే నేనప్పుడు ఖైరతాబాద్‌లో ఉండేవాణ్ణి. ప్రతిరోజు సాయంత్రం 5 గం॥ల నుంచి రాత్రి 9 గం॥ల వరకు అక్కడే కూర్చుండే వాళ్ళం. అక్కడ కవిత్వా న్ని ప్రేమించే వాళ్ళంతా జమయ్యేవాళ్ళు. అన్ని సాహిత్య ప్రక్రియలపై చర్చలు జరిగేవి. ముఖ్యం గా కొత్త తరాన్ని కవిత్వం వైపు లాగటం, కవిత్వం రాసే పద్ధతులు తెలియజేయడం, సవర ణలు సూచనలు చేయడం జరిగేవి. అట్లా 35 ఏళ్ళు గడిచాయి. కొన్ని రోజులు నా కాలికి దెబ్బ తాకి వెళ్ళక, తర్వాత వెళితే ఆ హోటల్ వాళ్ళు “ఏం సార్! అడ్డా మార్చారా?” అని అడిగారు. అంత స్థిరమైన గుర్తింపు వచ్చింది. ఈ మా ప్రస్థానంలో నాలుగైదు తరాల కవులు పాల్గొన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, వరవరరావు, చేకూరి రామారావు, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, దేవీప్రియ, నందిని సిధారెడ్డి, నారాయణస్వామి, ఆశారాజు, నాళేశ్వరం శంకర్, జింబో, మహజ బీన్, మద్దూరి నగేష్‌బాబు, దిగంబర కవులు అట్లా అనేక మంది పాల్గొన్నారు. కవికి, సమాజం పట్ల బాధ్యత వుండాలి, అనే చర్చ జరిగేది. కవి అనేవాడికి వస్తువును కవిత్వం చేసే శక్తి కావాలి కదా! అతడు మనిషిలోని అగ్నిని, ఆశను ఆరిపోకుండా కాపాడగలగాలి. మనిషిని మనిషిగా బతకనీ యడానికి మార్గం చూపాలి. జీవితం పట్ల అత్యున్నతమైన ప్రేమ ను పంచాలి. పాఠకుడు కూడా “ఫ్రీ కన్సీవ్డ్‌”గా, ముందుగా ఏర్పర చుకున్న అభిప్రాయాలతో పని లేకుండా, శుద్ధ పాఠకుడిగా వుండా లి. రంగుటద్దాలతో ఏదీ చూడ కూడదనేది మా అభిప్రాయం.
నా వరకు వస్తే, నేను బాల్యంలో అనుభవించిన దుర్భర వేద నామయ ప్రపంచం మధ్య నన్ను నేను ఓదార్చుకోడానికి కవి త్వాన్ని ఉపకరణంగా వాడుకున్నాను. విశాలాంధ్ర బుక్ హౌస్ మొదట నాకు ఆశ్రయమిచ్చింది. అట్లే అసంఖ్యాకంగా అన్ని దేశాల కవుల్నీ అధ్యయనం చేశాను. అటు ఆఫ్రికన్ కవుల నుండి ఇటు యూరోపియన్, లాటిన్, అమెరికన్ కవుల దాకా వారి కవిత్వాన్ని మథించాను. సెంఘార్, నెరూడా, రిట్‌సాస్, వ్లదిమీర్ హోలన్ నుంచి నేడు నూతనంగా రాస్తున్న కవుల దాకా పరిశీ లించాను. జీవితాన్ని ఎలా చూడాలో, ఎందుకు చూడాలో, ఏయే అంశా ల్ని ఏయే దృష్టి కోణం నుంచి కవిత్వీకరించాలో చెప్పారు వారంతా. అట్లా అధ్యయనం ఆచరణ, సృజన నా జీవితంలో విడ దీయకుండా జరుగుతున్నాయి. పత్రిక నడపాలనుకున్నాను అనే పత్రికను కొన్నాళ్ళు నడిపాను. నగ్నముని – “ఎడి టర్‌గా మిగిలిపోతావా?” అన్నాడు. పత్రికను ఆపేశాను. ‘భారతి’ పత్రికలో సమీక్షలు రాసేవాడిని అవీ ఆపేసి కేవలం కవిగానే మిగిలిపోవాలనుకున్నాను. మంచి కవిత్వం వస్తే సంతో షిస్తున్నాను. వ్యక్తిగతంగా నాపై వామపక్ష భావ జాలం ముద్ర ఉన్నా, దాని కోసం నే నెవర్నీ ఒత్తిడి చేయలేదు. తరచుగా విశాలాంధ్ర బుక్‌హౌస్‌కి వెళ్ళేవాడిని, కమ్యూనిస్టు మేనిఫెస్టోని, మయకో విస్కీ రాసి, శ్రీశ్రీ అనువదించిన లెనిన్ కావ్యాన్ని కొని కొత్త కవులకు ‘ఫ్రీ’ గా ఇచ్చే అలవాటుంది.

కవి సంగమం

యాకూబ్ 

రోజురోజుకీ మానవతా విలువలు సన్నగిల్లుతున్నాయి. ఆర్థిక సంబంధాలే ప్రధానంగా కనబడుతున్నాయి. వృద్ధు లైన తల్లిదండ్రుల్ని పట్టించుకోక వృద్ధాశ్రమాలకు పం పించే దుస్థితి ఇందుకో ఉదాహరణ. ఇలాం టి దృశ్యాలు మంచిగా తోచలేదు.కవిగా నేను ఆలోచించింది కవిత్వం రాయగలిగిన వాడు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిం చుకుంటాడు. దానివల్ల సామాజిక ప్రయోజనం కలుగుతుంది. మానవత్వం కొంతైనా మెరుగుపడు తుంది, అనేదొక అభిప్రాయం.
1980 తర్వాత కవిత్వం రాయడం కొత్త తరానికి చేత గాదనుకునేవారు. కానీ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిత్వం వెల్లి విరిసింది. ఉద్యమానికి బాసటగా నిల్చింది. నిత్యనూతనంగా వచ్చింది. దాన్ని పెంపొందింప జేయాలని 9, ఫిబ్రవరి 2012 నాడు ఫేస్‌బుక్‌లో ప్రారం భించాను. అనేక మంది కొత్త తరం కవులు పాలు పంచు కున్నారు. మంచి స్పందన వచ్చిం ది. కానీ, ఫేస్‌బు క్‌లో వెంటనే పబ్లిష్ అయినా చెదురుమదురుగానే వుంటుంది కదా! అందుకే కవులంతా ఒకచోట సమావేశమైతే బాగుంటుందనుకున్నా. 15 ఆగస్టు 2010 నాడు ‘కవి సంగమం’ ఏర్పాటు చేశాను. ఉస్మానియా యునివర్శిటీ లోని, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్(ఇప్లూ)లో సంగం మొదటి సమావేశం జరిపాం. ఆ సభకు ప్రముఖ బెంగాలీ కవి, ‘ఇండియన్ లిటరేచర్’ సంపాదకుడు సుభాష్ సర్కార్‌ను ఆహ్వానించాం. 500 మంది దాకా సాహితీ ప్రియులు వచ్చారు. అందులో బి.నర్సింగరావు, గుడి పాటి, కె.శివారెడ్డి కూడా సందేశాలిచ్చారు. ‘కవి సంగ మం’ 2013 వరకు బంజారాహిల్స్‌లోని ‘లామకాన్’లో నిర్వహించాం. 2014 నుంచి అబిడ్స్‌లోని ‘గోల్డెన్ త్రెషోల్డ్’లో సమావేశమవుతున్నాం. ప్రతి నెల రెండవ శని వారం సాయంత్రం 6 గం॥లకు కూర్చుంటున్నాం. ఇందులో ఒక సీనియర్ కవి, ఒకరు నా (యాకూబ్) తరం కవి, ముగ్గురు కొత్త కవుల్ని తప్పక ఆహ్వానిస్తు న్నాం. మొదలు ముగ్గురు కొత్త కవులు కవితల్ని చదువు తారు. తర్వాత కాస్త వెలుగులోకి వచ్చిన కవి, చదువు తాడు. వీటన్నింటిపై పాల్గొన సీనియర్ కవి సమీక్షిస్తూ మాట్లాడతాడు. అందులో ‘కవిత్వ రచన చేయడ మెట్లా’ అనే ప్రస్తావన వుంటుంది. అట్లా నగ్నముని, వరవ రరావు, దేవీ ప్రియ, రామా చంద్రమౌళి, వఝ్జల శివ కుమార్, శీలా సుభద్రాదేవి ఇత్యాది చేయి తిరిగిన కవులు పాల్గొని మంచి కవిత్వంపై అవగాహనను పెంచు తున్నారు. ఫేస్ బుక్ ‘కవి సంగ మం’ కూడ నడు స్తున్నది. ముఖ్యంగా ప్రతి ఆదివారం నారాయణస్వామి వెంకట యోగి గారి ద్వార ‘కవిత్వం తో నా కరచాలనం’ బాగా ప్రాచుర్యం వహిస్తున్నది.
అంతేగాక 2013 నుండి కవి సంగమంలో చదివి ఎంపిక చేయబడిన 144 మంది కవితలతో 400 పేజీలు గల పుస్తకం ప్రచురించాం. వాహెద్ రాసిన – మగ్దూం మొహి యొద్దీన్, ఫైజ్ అహ్మద్ ఫైజ్‌లను అట్లే ఎన్. వేణుగోపాల్ రాసిన ‘కవిత్వంతో ములాఖత్’లను ఇప్పటివరకు ప్రచు రించాం. మా ‘కవి సంగమం’ ‘మీట్ ది పోయెట్ ’ అనే మరొక కార్యక్రమం ప్రవేశపెట్టాం. అట్లా ఇతర భాషల్లోని ప్రఖ్యాత కవుల్ని ఆహ్వానించాం.
అట్లా- శ్రీలంక కవి చేరన్ రుద్రమూర్తి, తమిళ కవయిత్రి సల్మా, కర్నాటక నుండి మమతా సాగర్; సింధీ కవి లక్ష్మణ్ దూబే, ఢిల్లీ నుంచి కృష్ణారావు, అమెరికాలో వుంటున్న నారాయణ స్వామి, అఫ్సర్ పాల్గొన్నారు. 2013లో పోయెట్రీ ఫెస్టివల్ పెట్టాం. అందులో గుజరాతీ కవి గీతాంశుయశచ్చంద్ర, 2014 తమిళ కవయిత్రి సల్మా పాల్గొని ప్రసంగాలు చేశారు.