Home కలం సాహిత్యంలో లఘుచిత్రం ఓ నూతన ఒరవడి

సాహిత్యంలో లఘుచిత్రం ఓ నూతన ఒరవడి

poetry

కవిత్వానికి దృశ్య రూపంలో ఆజ్యం పోసిన వారు కర్నూలు గణేష్ ఆర్ట్ క్రియేషన్ అధినేత కొత్తూరు సత్య నారాయణ గుప్త అని ప్రతీ తెలుగు వాడు గర్వంగా చెప్పవచ్చు. సాధారణంగా ఎందరో రచయితలు రాసిన పాటలు వీడియోలుగా చిత్రీకరించబడ్డాయి, కానీ కవితలకు ఆ గుర్తింపు దక్కడం ప్రతీ కవీ ఆనందించాల్సిన విషయం.ఈ క్రమంలో ప్రగతి అనే లఘు చిత్రం గణేష్ ఆర్ట్ క్రియేషన్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. ఒక మంచి కవిత మనసుని కదిలిస్తుంది, ప్రశ్నిస్తుంది, ఆలోచింపజేస్తుంది, మార్పుకు కారణమవుతుంది. అదే కవిత అద్భు త దృశ్యమై కళ్ల ముందు మెదిలితే, ప్రతీ మనసు భావ తడిని తన గుండెలపై పరుచుకుంటుంది. అలాంటి ఓ నూతన ప్రక్రియ ప్రగతి అను లఘుచిత్రం ద్వారా తెలుగు సాహిత్య రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులోని ఏడు కవితలు ఏడు విభిన్న కోణాల్లో కొలువుదీరాయి. మొదటిలోనే చిన్న నాటి తీపి జ్ఞాపకాలను మళ్లీ మనసులో పలింకించేలా, ఆనాటి చిలిపి అల్లరులను, బాల్య స్నేహితులను కళ్ల ముందు ప్రతిబింబించేలా ‘ప్రభుత్వ పాఠశాల’ అనే కవిత కొలువు తీరింది.

ఇందులోని అంశం సందేశాత్మకంగాను, స్మృతి కవితగాను, హిత బోధగాను కనిపిస్తుంది. ఇందులో కవి ప్రకృతికి వరం అమ్మ ఒడి అంటూ ఇక్కడి స్నేహం జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకంతో ముడిపెడుతారు. ఎన్నో హృదయాలు నీ కోసం వేచిచూస్తుంటాయి అనడం నిష్కల్మశమైన పల్లెటూరి ప్రేమకు నిదర్శనం. ఇక్కడ ఎ.సి బాక్సులుండవు,చల్లని మనసులుంటాయి అన్న అభివ్యక్తి పాఠకులని అలరిస్తుంది.

ఇక్కడ హాట్ బాక్సుల్లో స్నాక్స్ ఉండవు, తట్టల్లో అందరికి ఒకటే భోజనం అనడం ద్వారా దృశ్యమానాన్ని వీక్షించిన ప్రతీ ఒక్కరినీ ఆ నాటి స్మృతులలోకి తీసుకెళ్తుంది.ఆ కాలపు జ్ఞాపకాలు, ఇంటర్వెల్లో బయట ముసలమ్మ అమ్మే సొండెలు, సమోసాలు, జామ పండ్లు చూపరులకు ఆ నాటి మధుర క్షణాలలోతప్పక లీనం చేస్తాయి. మరి కవిత్వం అంతిమ లక్ష్యం సమాజాన్ని కదిలించడమే కదా. అందులో ఈ దృశ్య కావ్యం విజయవంతమైందనే చెప్పాలి. అంతరార్దంగా ఈ కవిత ఎన్నో సందేశాలనందిస్తుంది. మనసుని ఆలోచింప చేస్తుంది.

అలాగే దృశ్యాన్ని చిత్రీకరించిన విధానం వీక్షకుల్ని ఒకప్పటి బాల్య స్మృతిలోకి తప్పక తీసుకునివెళ్తుంది. ‘ఓ పిచ్చి మనిషి’ అనే కవిత కాలం గురించిన విలువైన విషయాలను తాత్వికుడిలా ప్రభోదిస్తుంది. మరో కవితలో యోగ ప్రాసత్యాన్ని మన ముందు ఉంచారు. ఆరోగ్యం ప్రాధాన్యతని,యోగా ద్వారా ఆరోగ్యం నీ చెంత చేరి ఆనందమే నీ ఆయుష్షు అవుతుందనడం ఔచిత్యంగా ఉంది. కవితలో ఇంకాస్త కొత్తదనం ఉం టే బాగుండేది. చిత్రించిన తీరు ఆహ్లాదకరంగా ఉంది.

అంతర్జాతీయ దినోత్సవంగా ఒక రోజును యోగా డే గా ప్రపంచం గుర్తించింది. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ కవిత సందేశాత్మకం. నమ్మ కం అనే మరో కవితలో జీవన వేదాంతం పలికింది. ఇందలి కవిత, చిత్రణ, నటుల ముఖ, స్వర కవళికలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. నమ్మకాలవ్మొతే పడే యాతన చూపరులకు ఏం తెలుసు,నమ్మిన మనిషిలోని నయవంచనను అంచనా వేయడం ఎవరి తరం అంటూ నేటి సమాజ దౌర్భాగ్య పరిస్థితిని ఆర్థంగా చిత్రీకరించారు. చివరికి కన్నీరై ప్రవహించే కాలంతో కొనసాగుతూ చింతించడం తప్ప, అందుకే నమ్మాలి అనడం సమాజానికి ఒక చిన్న చరుపు. ఈ కవితా దృశ్యం సందేశాత్మకం.
మనసుని కదిలించే నీతి పాఠం. ఇక ఇందులో ఒక బాల గేయం కూడా ఉంది. దీని ద్వారా బాలల సాహిత్యానికున్న ప్రాధాన్యతను తెలియజెప్పారు.

అలతిఅలతి పదాలతో సాగిన ఈ కవిత మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చివరగా యువ తా ‘జర భధ్రం’ అంటూ నీతి సందేశాన్ని అందించారు. ఎటుపోతోంది యువతరం అంటూ యువతని కాదు, యావత్ సమాజాన్నే ప్రశ్నించారు. ఏమవుతుంది భావిభారతం అం టూ నిట్టూర్పుని వదిలారు. నింగికి నేలకి మధ్య గాలిపటంలా వేలాడుతున్న యువత భవిష్యత్తును హెచ్చరించారు. స్వీయ నియంత్రణ పాటించడం నీ ధర్మం అంటూ యువతకి సందేశాన్ని ఇవ్వడమే కాక, వారి భాధ్యతను వారికి గుర్తు చేశారు.

పరవస్తు విశ్వక్సేన్
8328384951