Home ఆఫ్ బీట్ కార్తీకమాసంలో దీపారాధన ప్రత్యేకత

కార్తీకమాసంలో దీపారాధన ప్రత్యేకత

 Kartika month

 

కార్తీకమాసంలో దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షాన్ని పొందుతారని పెద్దలు చెబుతారు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నంగా అయినా, భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందు వల్ల అనంత పుణ్యఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణుభక్తులకు కూడా వస్తుంది. ఈ మాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.

ఆచార విధి కూడా. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో శనిత్రయోదశి కన్నా కార్తీక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన, అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది. ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయడం తప్పనిసరి.

Liturgy specializes in Kartika month