Home తాజా వార్తలు ప్రాణం తీసిన సహజీవనం

ప్రాణం తీసిన సహజీవనం

Murder

 

న్యూఢిల్లీ: ఓ మహిళ తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేయించిన సంఘటన ఢిల్లీలోని అమర్ కాలనీలో చోటుచేసుకుంది. అనిత (25) అనే మహిళ భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా ఉంటుంది. సునీల్ తమాంగ్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో అతడితో ఆమె సహజీవనం చేస్తోంది. సునీల్‌తో అనిత సహజీవనం చేయడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఈ మధ్యలో సునీల్, అనితకు మనస్పర్థలు రావడంతో ఇద్దరు గొడవపెట్టుకున్నారు. దీంతో సదరు మహిళ సునీల్ ను చంపాలని తన తమ్ముడు బిజయ్ చెత్రికి తెలిపింది. బిజయ్ చెత్రి, అతడి బంధువు రాజేందర్ చెత్రి ఇద్దరు  కలిసి సునీల్ చంపాలని ప్లాన్ వేశారు. ఢిల్లీలోని తన చెల్లి ఇంటికి సమీపంలో  హోటల్ లో వాళ్లు బస చేశారు. సునీల్ గాఢ నిద్రలోకి చేరుకున్న అనంతరం అనిత వాళ్లకు కత్తి ఇచ్చిన ఇంటి నుంచి వెళ్లిపోయింది. నిద్రలో ఉన్న సునీల్‌ను బిజయ్, రాజేందర్ కత్తితో పొడిచి హత్య చేసి పశ్చిమ బెంగాల్ పారిపోయారు.  మరుసటి రోజు సునీల్ ను ఎవరో చంపేశారని అనిత కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గత రాత్రి అనితను ఎక్కడ ఉన్నావని ప్రశ్నించడంతో ఆమె తడబాటు సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు తనదైన శైలిలో ఆమెను ప్రశ్నించిడంతో తానే హత్య చేయించానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 
Live-in Partner Killed by Women, Relative in Delhi

 

Live-in Partner Killed by Women, Relative in Delhi