Home తాజా వార్తలు యువకుడి తలతో పోలీస్ స్టేషన్‌కు..

యువకుడి తలతో పోలీస్ స్టేషన్‌కు..

Murder
నల్లగొండ: జిల్లాలోని నాంపల్లి మండలంలో శనివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. అనంతరం నిందితులు ఇర్ఫాన్, గౌస్ లు మృతుడి తలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని నాంపల్లి మండలం నేరెళ్లపల్లివాసి సద్దాం గుర్తించారు. హత్య చేసిన దుండగులు మృతుడికి బంధువులేనని సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Live murder in nampally mandal in nalgonda