Home జాతీయ వార్తలు కొవిడ్ నుంచి కోలుకున్న 14 మంది కాలేయాల్లో చీముగడ్డలు

కొవిడ్ నుంచి కోలుకున్న 14 మంది కాలేయాల్లో చీముగడ్డలు

Liver abscess found in 14 covid recovered patients in delhi

 

న్యూఢిల్లీ : కొవిడ్ సంక్రమించిన తరువాత కోలుకున్నప్పటికీ కొంతమంది రోగుల్లో వ్యాధినిరోధక శక్తి తగినంతగా ఏర్పడక పోవడం, వారు స్టెరాయిడ్స్ వాడడం వల్ల కొన్ని అసాధారణ అనారోగ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. అలాంటి 14 మంది రోగుల్లో గత రెండు నెలలుగా కాలేయంలో చీము గడ్డలు (చీముపట్టే గడ్డలు) పెద్ద సైజులో ఏర్పడడమే కాక, వారిలో ఒకరు ఉదరంలో అత్యధిక రక్తస్రావం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సర్ గంగారామ్ ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు ఈ వివరాలను గురువారం వెల్లడించాయి.

సాధారణంగా ఎంటామీబా హిస్టోలిటికా అనే అనే పరాన్న జీవి కలుషిత ఆహారం, నీరు ద్వారా సంక్రమించడం ద్వారా కాలేయంలో చీము గడ్డలు ఏర్పడుతుంటాయని వైద్యులు తెలిపారు. గంగారామ్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఈ 14 మందిలో 10 మంది పురుషులు కాగా, నలుగురు మహిళలు. 28 నుంచి 74 ఏళ్ల వరకు వయసు ఉన్న వీరు గత రెండు నెలలుగా చికిత్స కోసం గంగారామ్ ఆస్పత్రికి వస్తున్నారు. బలమైన పోషకాహారం లోపించడం, స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్లనే వారికి ఈ అనారోగ్య లక్షణాలు ఏర్పడ్డాయని వైద్యులు భావిస్తున్నారు.

Liver abscess found in 14 covid recovered patients in delhi