Tuesday, March 21, 2023

కంది రైతులను ఆదుకోని ప్రభుత్వం

- Advertisement -

cong

*రాష్ట్రంలో 4 వేల మంది రైతుల ఆత్మహత్యలు : కొడంగల్  ఎమ్మెల్యే రేవంత్ 

మన తెలంగాణ/తాండూరు : రాష్ట్రంలో రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టిపిసిసి చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా మంగళవారం తాండూరు చేరుకున్న బస్సు యాత్ర స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని  విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వక పోతే కేసిఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని జీవించే వారని ఎద్దేవా చేశారు. కేవలం కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేనివారికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. మంత్రి వర్గంలో ఉన్న  ఆరుగురు మంత్రులు కేవలం కేసిఆర్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసిఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నాలుగేళ్లు గుర్తుకు రాని రైతులు కాంగ్రెస్ బస్సు యాత్రతో గుర్తుకు వచ్చారని అన్నారు. రైతు సమితుల పేరుతో సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు.మద్దతుధర కోసం ధర్నాచేస్తున్న ఖమ్మం జిల్లా రైతులను బేడీలు వేసి అరెస్ట్ చేసిన కేసిఆర్ రైతుల గురించి మాట్లాడే హాక్కు లేదని అన్నారు.తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంభాలను పట్టించుకోలేదని కనీసం వారికి పరిహారం కూడా చెల్లించని ముఖ్యమంత్రి ప్రస్తుతం భీమా పాలసీలు పేరుతో మారో సారి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.రైతు రుణమాఫి ఇస్తామని చెప్పిన కేసిఆర్ నాలుగు విడతలుగా ఇవ్వడంతో రైతులకు అందలేదని కేవలం బ్యాంకు మిత్తి కింద జమచేసుకున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫి ఒకేసారి చేస్తామని చెప్పారు.తాండూరు ప్రాంతంలో కందిరైతుల కోసం కంది బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి మహేందర్‌రెడ్డి ఇంత వరకు ఏర్పాటుచేయలేదని అన్నారు.దీంతో రైతులకు కందిమద్దతు ధర లేకునష్ట పోతున్నారని అన్నారు.వెంటనే తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కందిమద్దతుధర సైతం పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంది మద్దతు ధర రూ.8 వేలకు పంచుతామనిహామిఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి అద్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,మాజి పిసిసి అద్యక్షులు హన్మంతురావు, బట్టి విక్రమార్క, శబీర్‌అలి, సిఎస్పినేత జానారెడ్డి,మాజి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి,ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా,శ్రీదర్‌రెడ్డి, మల్లురవి, పొన్నం ప్రభాకర్, రామ్మోహన్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డిరంగారెడ్డి,క్యామ మల్లేష్, ఎం నార్యాణరావు, కార్తిక్ రెడ్డి, నర్హింహరెడ్డి(బాబు), సంపత్‌కుమార్, నియోజకవర్గం ఇంచార్జి రమేష్, డిసిసిబి మాజి చైర్మన్ లకా్ష్మరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సునితా సంపత్,దారాసింగ్,మాజి మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, సురేష్, ప్రభాకర్‌గౌడ్, పట్లోళ్ళ నర్సింలు, శ్రీనివాస్‌చారి,నరేష్ మహారాజ్, రాకేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles