Home జాతీయ వార్తలు ఆర్టికల్‌ 370 రద్దు బిజెపి మూల సిద్ధాంతం : అద్వానీ

ఆర్టికల్‌ 370 రద్దు బిజెపి మూల సిద్ధాంతం : అద్వానీ

LK Advaniఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై బిజెపి కురు వృద్ధుడు ఎల్ కె అద్వానీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు బిజెపి మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ సమగ్రతను బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనసంఘ్ నాటి నుంచి ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. వారిని ఆయన అభినందించారు. జమ్మూకశ్మీర్ , లద్దాఖ్ లో శాంతి వెల్లివిరిస్తుందని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, లఢక్ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

LK Advani Comments On Article 370 Cancellation