Home జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం అదనపు పనుల కోసం రుణం

కాళేశ్వరం అదనపు పనుల కోసం రుణం

Kaleshwaram Projectహైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు పనుల కోసం రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకునేందుకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఈ రుణం తీసుకోనుంది. మేడిగడ్డ జలాశయం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు మూడో టిఎంసి ఎత్తిపోతల పనుల కోసం రూ.4657.95 కోట్ల రుణం తీసుకోనుంది. మధ్యమానేరు నుంచి కొమురవెల్లి మల్లన్న సాగర్ వరకు మేడో టిఎంసి ఎత్తిపోతల పనుల కోసం రూ.14,093.43 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తం రూ.18,751.38 కోట్ల అప్పుగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకునే ఈ మొత్తం రుణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ప్రాజెక్ట కోసం రుణం తీసుకునేందుకు తెలంగాణ సిఎస్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

Loan For Kaleshwaram Project Extra Works