Home జాతీయ వార్తలు రైతులకు రుణమాఫీ : రాహుల్‌గాంధీ

రైతులకు రుణమాఫీ : రాహుల్‌గాంధీ

rahul-gandhiసహరాన్‌పూర్ : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతులుకు రుణమాఫీతో పాటు విద్యుత్ ఛార్జీల తగ్గింపు హామీలను ఇచ్చారు. రాష్ట్రంలో ఆయన కిసాన్ యాత్ర నిర్వహిస్తున్నారు.ఈ యాత్రలో భాగంగా మంగళవారం మణిహరణ్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని నిందించారు. మరో వైపు రైతులకు ఇవ్వాల్సిన రూ.1.19 లక్షల కోట్ల రుణాలను కేంద్రంపరిశ్రమలకు అందించదని ఆరోపించారు.