Friday, April 26, 2024

బిజెపిలో లోకల్ నాన్‌లోకల్ రగడ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపిలో లోకల్ నాన్ లోకల్ రగడ రాజుకుంటోంది. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి నేతల మధ్య అంతర్గత కుంపట్లు భగ్గుమన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా, 2019లో లోక్‌సభ అభ్యర్ధిగా మాజీ ఎంఎల్‌సి ఎన్. రామచంద్రరావు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి నుంచే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తోన్న రామచంద్రరావును నాన్‌లోకల్ ముద్ర వెంటాడుతోంది.

రామచంద్రరావుకు కాకుండా తమకే టికెట్ ఇవ్వాలని స్థానిక బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు పార్టీ ప్రచారం కూడా చేపట్టారు. బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న జి. రవితో పాటు మరికొందరు అక్కడి బిసిలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. దీంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో లోకల్, నాన్ లోకల్ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. ఈ నేపథ్యంలో జి. రవి సొంతంగా బిజెపి స్థానిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రవి పాదయాత్ర నిర్వహించడం బిజెపిలో చర్చానీయంశంగా మారింది.

ప్రస్తుతం మల్కాజిగిరిలో బిజెపి పట్ల సానుకూల వాతావరణం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో లోకల్, నాన్ లోకల్ రగడ ఎటు దారితీస్తుందనే బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పార్టీ బలోపేతానికి బిజెపి ఇటీవల పాలక్, ప్రబారీలను అన్ని నియోజకవర్గాల్లో నియమించింది. మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలక్‌గా ఎన్వీ సుభాష్ , ప్రభారీగా బుచ్చిరెడ్డిని నియమించారు. నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండాలని పాలక్‌లను పార్టీ ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు మల్కాజిగిరి పాలక్ నియోజకవర్గానికి రాలేదని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఎన్. రామచంద్రరావు, జి. రవి మధ్య తలెత్తిన లోకల్, నాన్ లోకల్ వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపతారదే ఉత్కంఠగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News