Home ఎడిటోరియల్ కరోనా అనంతర కల్లోలం

కరోనా అనంతర కల్లోలం

Lockdown

 

వారం రోజుల క్రితం నుంచి కొన్ని సడలింపులు అమలులోకి వచ్చాయి. సినిమా హాళ్లు, పెద్ద పెద్ద మాల్స్, హోటల్స్, కొన్ని రకాల పరిశ్రమలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల లాంటి ప్రార్ధనామందిరాలు, సెలూన్స్ మొదలైన వాటికి ఇంకా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ఈ నెల పదిహేను తరువాత తెలంగాణ ప్రభుత్వం మరోమారు సమీక్ష జరిపి వీటిలో కొన్నింటికైనా అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. గృహనిర్మాణ సంబంధమైన స్టీల్, సిమెంట్ మొదలైన సామాగ్రి అమ్మే షాపులు, మద్యం దుకాణాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఈ రంగాలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం అనివార్యం అయ్యాయి. మన ఆరోగ్యం కోసం ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. కరోనా నివారణకు మరో ఏడాదివరకు వాక్సిన్, మందులు వచ్చే అవకాశం లేకపోవడంతో స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనాతో కలిసి సహజీవనం చెయ్యక తప్పదు.

కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించడమే కాక, ప్రపంచంలోని అన్ని దేశాలని స్తంభింపజేసిన కోవిద్ – 19 ఈ శతాబ్దపు అతి పెద్ద విపత్తుగా చరిత్రలో నిలిచిపోతుంది. కరోనా పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటివరకు లక్షలమంది ప్రాణాలను హరించింది. దాదాపు నలభై లక్షల మందిని మరణం అంచుకు తీసుకెళ్లింది. భారతదేశం కొంచెం ఆలస్యంగా మేలుకొన్నప్పటికీ, పటిష్టంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ప్రపంచదేశాలతో పోల్చినపుడు మనకు ప్రాణనష్టం తక్కువే. అయినప్పటికీ, మన ఆర్ధికవ్యవస్థ మీద కరోనా కొట్టిన దెబ్బనుంచి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అధికారికంగా ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అంటే సుమారు డెబ్బై రోజుల పాటు భారతదేశం ఎలాంటి కార్యకలాపాలు లేకుండా స్తంభించింది. ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, పారిశ్యుధ్య కార్మికులు మినహా మిగిలిన పౌర సమాజం అంతా గృహాల్లోనే నిర్బంధించబడింది.

వారం రోజుల క్రితం నుంచి కొన్ని సడలింపులు అమలులోకి వచ్చాయి. సినిమా హాళ్లు, పెద్ద పెద్ద మాల్స్, హోటల్స్, కొన్ని రకాల పరిశ్రమలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల లాంటి ప్రార్ధనామందిరాలు, సెలూన్స్ మొదలైన వాటికి ఇంకా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ఈ నెల పదిహేను తరువాత తెలంగాణ ప్రభుత్వం మరోమారు సమీక్ష జరిపి వీటిలో కొన్నింటికైనా అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. గృహనిర్మాణ సంబంధమైన స్టీల్, సిమెంట్ మొదలైన సామాగ్రి అమ్మే షాపులు, మద్యం దుకాణాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఈ రంగాలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం అనివార్యం అయ్యాయి. మన ఆరోగ్యం కోసం ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. కరోనా నివారణకు మరో ఏడాదివరకు వాక్సిన్, మందులు వచ్చే అవకాశం లేకపోవడంతో స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనాతో కలిసి సహజీవనం చెయ్యక తప్పదు.

వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించింది అని చెప్పాలి. వారికి భోజన వసతి సదుపాయాలు కల్పించింది. నలభై రోజుల అనంతరం వారు స్వగ్రామాలకు వెళ్ళడానికి కేంద్రం అనుమతి ఇవ్వగానే, ప్రత్యేక రైళ్ల ద్వారా వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. వెళ్లాలనుకున్నవారు వెళ్లారు…మరికొందరు తిరిగి వస్తున్నారని సమాచారం ఉన్నది. అలాగే అత్యవసర పనుల నిమిత్తం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్లాల్సి వస్తే పోలీసు శాఖ కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నది. మరికొద్ది కాలంలో విమానాలు, రైళ్లు, బస్సులు, ఆటోలు కూడా నడిచే అవకాశం ఉన్నది. కాకపోతే యాభై మంది ప్రయాణీకులు ఎక్కాల్సిన బస్సులో పదిహేను లేదా ఇరవై మందిని మాత్రమే ఎక్కిస్తారు. అలాగే రైళ్లలో కూడా ఒక్కొక్క సీటుకు ముగ్గురు బదులు ఒక్కరినే అనుమతించే ఛాన్స్ ఉన్నది.

ఇగ బాగా దెబ్బతిన్న రంగం సినిమా రంగం. గతంలో మాదిరిగా పెద్దఎత్తున సినిమా రిలీజులు ఇక మీదట ఉండకపోవచ్చు. విడుదల అయినా, హడావిడి ఉండదు. పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తారు. ఏడువందల సీట్లు ఉండే థియేటర్లో రెండువందల యాభై లేదా మూడు వందలమందిని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా, సినిమాహాలుకు వెళ్లాలంటే కూడా భయపడే వాతావరణం మరో ఏడాది పాటు కచ్చితంగా కొనసాగుతుంది. కుటుంబాలతో కలిసి సినిమాకు వెళ్లడం ఇకమీదట చరిత్రగా మిగిలిపోతుంది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా, భయంతో వణికిపోవడం తధ్యం. అలాగే విశ్రాంతి సమయంలో క్యాంటీన్ల మీద ఎగబడి కొనుక్కునే దృశ్యాలు కూడా గత వైభవమే. కిరాణా సామాన్ల జాబితాలో మాస్కులు, శానిటైజర్లు కచ్చితంగా చేరుతాయి. గతంలో రోజుకు ఒకసారి కూడా చేతులు కడుక్కునే అలవాటు లేనివారు ఇకపై రోజుకు పదిసార్లు చేతులతో పాటు కాళ్ళు కూడా కడుక్కుంటారు. బయటనుంచి రాగానే నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రంగా స్నానం చేస్తారు. అలాగే బజారు నుంచి ఏమి కొనుక్కొచ్చినా ఒక గంటసేపు బయట ఎండలో పెడతారు. బయట హోటళ్లకు వెళ్ళడానికి, రోడ్లపక్కన అమ్మే అల్పాహారాలు తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఆ మేరకు వ్యాపారరంగాలు దెబ్బతింటాయి.

ఉద్యోగ జీవితంలో తొలిసారిగా రెండు మాసాలపాటు వేతనాలు పూర్తిగా అందకపోవడం, సగం సగం అందటం, కొందరికి ఆ అదృష్టం కూడా లేకపోవడంతో ఖర్చులు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. మన ఆర్ధికవేత్తలతో పాటు మన పెద్దలు కూడా చెప్పే పాఠం ఏమిటంటే…మనకు ఆరు నెలలపాటు ఉద్యోగం లేక సంపాదన ఆగిపోయినా సరే, మన నిత్యజీవనశైలిలో ఎలాంటి మార్పు ఉండకూడదని. అంటే అర్ధం సంపాదిస్తున్నప్పుడు బాగా పొదుపు చెయ్యమని. కానీ, ఆ పాఠాలు నేటితరానికి రుచించవు. ఎప్పటిదప్పుడు ఖర్చు చెయ్యడంలో అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అలాంటివారు ఈ లాక్ డౌన్ సమయంలో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను చవిచూశారు. ఒక నెల ఇంటి అద్దె కూడా కట్టలేక యజమానులు ప్రాధేయపడ్డారు. దీన్నిబట్టి చూస్తే మధ్యతరగతి వారి ఆర్ధిక నిర్వహణ ఎంత దయనీయంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇకమీదట మధ్యతరగతి జీవులు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు.

ఇగ చాలా రంగాల్లో అనేకమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారం లేకపోవడంతో అనేక సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. లాక్ డౌన్ అనంతరం వీరిసంఖ్య దేశవ్యాప్తంగా పాతికలక్షల పై చిలుకే ఉండవచ్చు అంటున్నారు. వీరందరి జీవితాలను కరోనా భూతం చిదిమివేసింది. ఐటి రంగంలో కూడా జీతాల పెంపుదల ఉండకపోవచ్చని ఐటి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆమేరకు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సమాచారం ఇచ్చాయట. ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని కంపెనీలు అమలు చెయ్యడంతో పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు లాప్ టాప్ ముందేసుకుని కూర్చున్న ఉద్యోగులు అర్ధరాత్రి పన్నెండు గంటలవరకు పనిచేయాల్సి వస్తున్నది అని వాపోతున్నారు. చాలామందికి జూన్ జులైలో వేతనాల పెంపు ఉంటుందట. ఈ ఏడాదికి పెంపుదల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఐటి ఉద్యోగులు వాపోతున్నారు. అసలు ఉద్యోగం నిలవడమే మహాభాగ్యంగా భావించాలి అని ఒక ఐటి రంగ ప్రముఖుడు చెప్పుకొచ్చాడు. ప్రభుత్వాలకు కూడా ఆదా యం పూర్తిగా పడిపోయింది. పోయిన ఆదాయాన్ని రికవర్ చేసుకోవాలంటే ధరలు పెంచక తప్పదు. ధరలు పెరిగితే తట్టుకునే తాహతు వినియోగదారులకు లేదు. ఎలా చూసినా రాబోయే రెండేళ్లు దేశానికి కష్టకాలమే. ఆచితూచి ఖర్చులు చేసుకోవాలి. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతె భయంకరమైన పరిస్థితులను చూడాల్సివస్తుంది.

Lockdown could be relaxed in some places