Home జాతీయ వార్తలు జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

Lockdown in containment zones extended till june 30

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో వైరస్ ను కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 4.0 గడువు రేపటితో ముగియనుండగా.. దానిని మరో 30 రోజులు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కాగా కంటైన్మెంట్ జోన్లు లాక్ డౌన్ పరిమితం చేస్తూ.. మిగిలిన జోన్లకు మినహాయింపులు ఉంటాయని తెలిపింది.

తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0  మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలియజేసింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లు తెరిచుకోవడానికి కేంద్రం అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు విజ్ఞాప్తి చేశాయి.

Lockdown in containment zones extended till june 30