Home జాతీయ వార్తలు బయట తిరగడానికి డాక్టర్ వేషం.. చివరకు జైల్ శిక్ష

బయట తిరగడానికి డాక్టర్ వేషం.. చివరకు జైల్ శిక్ష

Noida-Man

 

ఉత్తర ప్రదేశ్: చైనాలో మొట్టమొదట వెలుగు చూసిన నావెల్ కరోనా వైరస్ ఇప్పుడు భూప్రపంచంపై కరాళ నృత్యం చేస్తోన నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహింస్తున్నాయి. రోడ్లపై ఒక వ్యక్తి కూడా తిరగొద్దని కేంద్రం, ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికి కొందరు ఆకతాయిలు మాత్రం బ‌య‌ట తిర‌గ‌డానికి విభిన్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే నోయిడాలో అశుతోష్ శర్మ అనే ఓ వ్యక్తి లాక్ డౌన్ ను తప్పించుకునేందుకు వైద్యుల దుస్తువులు (ల్యాబ్ కోట్, వైట్ గ్లోవ్స్, సర్జికల్ మాస్క్) ధరించి విధుల్లో తిరుగుతున్నాడు.  ఓ రోజు విధుల్లో గస్తీ కాస్తున్న ఓ పోలీసు అదికారి అశుతోష్ ను అడ్డుకొని ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏ హాస్పిటల్ లో పని చేస్తున్నవ్, మీ హాస్పటిల్ ఎక్కడ వెళ్దాం పదా. అంటూ పోలీసులు ప్రశ్నించడంతో అశుతోష్ నీళ్లు నమిలాడు. దీంతో అతడిని నకిలీ డాక్టర్ గా గుర్తించి కేసు నమోదు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Lockdown rules break with doctor getup at Noida