Wednesday, April 24, 2024

నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యం లోనే కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర ధరలను కట్టడి చేసేందుకు వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పిడి యాక్ట్ కింద కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కూరగాయలు                       

వంకాయ- రూ.30 కేజీ
బెండకాయ- రూ.40 కేజీ
టమాట- రూ.10 కేజీ
అరటికాయ- రూ.40 కేజీ
కాలిఫ్లవర్- రూ.40 కేజీ
క్యాబేజి- రూ.23 కేజీ
పచ్చిమిర్చి- రూ.60 కేజీ
చిక్కుడుకాయ- రూ.45 కేజీ
బీరకాయ- రూ.60 కేజీ
క్యారెట్- రూ.60 కేజీ
ఆలుగడ్డ- రూ.30 కేజీ
ఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30 కేజీ
ఉల్లి(ఎర్రవి)- రూ.35 కేజీ
వెల్లుల్లి- రూ.160 కేజీ
అల్లం- రూ.220 కేజీ

ఆకు కూరలు
పాలకూర- కిలో రూ.40
తోటకూర- కిలో రూ.40
కొత్తిమీర- కిలో రూ.60
మెంతీకూర- కిలో రూ.60

నిత్యావసర వస్తువులు

కందిపప్పు (గ్రేడ్1)- కిలో రూ.95
మినపపప్పు కిలో రూ.140
పెసరపప్పు- కిలో రూ.105
శనగపప్పు- కిలో రూ.65
సజ్జలు- కిలో రూ.30
గోధుమలు- కిలో రూ.36
జొన్నలు- కిలో రూ.38
రాగులు- కిలో రూ.40

Lockdown: TS Govt finalized Vegetable prices

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News