Home జాతీయ వార్తలు రబ్రీదేవి, తేజస్వియాదవ్‌లపై లాక్‌డౌన్ ఉల్లంఘన కేసు

రబ్రీదేవి, తేజస్వియాదవ్‌లపై లాక్‌డౌన్ ఉల్లంఘన కేసు

Lockdown violation case on Rabri Devi, Tejasvi Yadav

 

పాట్నా : లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, విపక్షనేత తేజస్వియాదవ్ తోపాటు 90 మందికి పైగా ఆర్‌జెడి నాయకులపై కేసు నమోదైంది. గోపాల్ గంజ్‌లో నిరసన తెలియచేయడానికి భారీ ఎత్తున సమావేశమయ్యారని అందుకే కేసు నమోదైందని పోలీసులు చెప్పారు.

92 మందిలో 32 మంది ప్రముఖులు కాగా, మిగతా 60 మంది మామూలు కార్యకర్తలు. మూడు హత్యలకు సంబంధించిన కేసులో బాధితులను కలుసుకోడానికి గోపాల్‌గంజ్‌కు వెళ్లడానికి తేజస్వియాదవ్ నిర్ణయించుకున్నారు. ఈ కేసులో అధికార పార్టీ జెడి(యు) ఎంఎల్‌ఎ నిందితుడైనా ఆయనను అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని యాదవ్ ఆరోపించారు.

Lockdown violation case on Rabri Devi and Tejasvi Yadav