Thursday, April 25, 2024

జులైలో మళ్లీ మిడతల దాడి

- Advertisement -
- Advertisement -

Locusts attack on India again in July

 

ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరిక

ఢిల్లీ : జులైలో మళ్లీ భారత్‌పై మిడతల దాడి ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరించింది. ఇటీవల మిడతల దాడితో తీవ్రంగా పంటను నష్టపోయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోసహా మొత్తం 16 రాష్ట్రాలను హెచ్చరించేలా కేంద్రాన్ని సంస్థ అప్రమత్తం చేసింది. మేలో రుతుపవనాలు రాకముందు వాయువ్యపాకిస్థాన్ నుంచి రాజస్థాన్ వరకు మిడతల దండు చెలరేగింది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దండు సాగింది. మిడతలు గుడ్లు పెట్టే ముందు రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు రుతుపవనాల ఆగమనం సమయంలో తూర్పు నుంచి పశ్చిమ వైపు తిరుగుతుంటాయని, జూన్‌లో దక్షిణ ఇరాన్ నుంచి ఈ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరించింది. జులైలో ఆఫ్రికా కొమ్ముగా పిలిచే దేశాలపై దాడి చేస్తుందని వివరించింది. ఇప్పటికే పంజాబ్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో మిడతల దండు పంటలను విపరీతంగా నష్ట పర్చింది. తూర్పు ఆఫ్రికాలో మిడతల రెండో సంతతి పెరుగుతోందని, ఫలితంగా జూన్ రెండో వారంలో జులై మధ్యలో మిడతల దండు దాడి చేయవచ్చని ఎఫ్‌ఎఒ హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News