Thursday, April 25, 2024

విండీస్ టీమ్ వినూత్న నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Logo of Black Lives Matter is printed on jerseys of West Indies cricketers

 

మాంచెస్టర్ : ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. ఇక వెస్టిండీస్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. అంతేగాక నల్లజాతీయులపై జరుగుతున్న వర్ణవివక్ష, దాడులపై నోరు విప్పారు. ఇదిలావుండగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి విండీస్ క్రికెటర్లు మద్దతుగా ఉంటున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా మద్దతుగా నిలిచినట్టు తెలిసింది. టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొనే వెస్టిండీస్ క్రికెటర్ల జెర్సీలపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే లోగోను ముద్రించారు. ఈ లోగోతోనే విండీస్ జట్టు టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం క్రీడల్లో కూడా జాతి వివక్ష తీవ్రంగా ఉందని, దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైన ఉందని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక జాతి వివక్షపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ లోగోతో బరిలోగి దిగుతున్నామని వివరించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News