Saturday, April 20, 2024

గులాబీ రంగులోకి మారిన లోనార్ సరస్సు

- Advertisement -
- Advertisement -
Lonar lake in Buldhana turns pink
లవణీయత, ఆల్గే కారణంగానే రంగు మార్పంటున్న శాస్త్రవేత్తలు

ఔరంగాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎందో మంది శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆకర్షిస్తున్న లోనార్ సరస్సు రాత్రికి రాత్రే ఒక్క సారిగా రంగు మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఆకుపచ్చని రంగులో ఉండే సరస్సు తాజాగా గులాబీ రంగులోకి మారడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే సరస్సులోని లవణీయత, ఆల్గే కారణంగానే ఇది గులాబీ రంగులోకి మారి ఉండవచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముంబయికి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో బుల్ధానా జిల్లాలో ఉన్న లోనార్ సరస్సు దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం సంభవించిన ఉల్కాపాతం కారణంగాఈ బిలం ఏర్పడినట్లుగా ఇప్పటికే నిర్ధారించారు.

దాదాపు 1.2 కిలోమీటర్ల వ్యాసార్ధంతో ఉంటుంది. దీనికున్న ప్రాచీన నేపథ్యం దృష్టా ప్రపంచవ్యాప్తంగా ఎందరో పరిశోధకులు ఇక్కడికి వస్తుంటారు.అయితే తాజాగా రాత్రికి రాత్రే ఈ సరస్సు రంగు మారడం అటు శాస్త్రవేత్తలతో పాటుగా ఇటు ప్రకృతి ఔత్సాహికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ సరస్సు రంగు మారడం ఇదే తొలిసారి కాదని లోనార్ సరస్సు సంరక్షణాభివృద్ధి కమిటీ సభ్యుడు గజానన్ ఖారత్ అంటున్నారు.లోనార్ బిలానికి ఉన్న ప్రాధాన్యత దృష్టా ఇప్పటికే దీన్ని జాతీయ భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించినట్లు ఆయన చెప్పారు.

గతంలో కూడా రంగుమారినప్పటికీ ఈ సారి మరింత తేజోవంతంగా గులాబీ రంగులో మెరుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు గజానన్ చెప్పారు. ఇలాగే ఇరాన్‌లో కూడా ఓ సరస్పు ఎరుపుగా మారిన విషయాన్ని ఖారత్ గుర్తు చేస్తున్నారు. ‘ గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం సరసులో నీరు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో తగినంతగా వర్షాలు లేకపోవడంతో కొత్తగాసరస్సులోకి నీరు వచ్చి చేరలేదు. ఇలా కనిష్ట ననీటిమట్టం ఉండడం కూడా లవణీయత పెరగడంతో పాటు , ఆల్గేకు కారణం . ఇదే సరస్సు రంగు మారడానికి కారణం కావచ్చు’ అని ఖారత్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News