Home స్కోర్ తిప్పేస్తారా..తిరిగిపడతారా?

తిప్పేస్తారా..తిరిగిపడతారా?

ఇక భారం బౌలర్ల పైనే!
సోమవారం(ఫైనల్ డే) పిచ్ భారత్ స్పిన్నర్లకు అనుకూలించి వికెట్లు తీయగలిగితేనే టీమిండియా గెలుస్తుంది. తుది రోజు అంత భారీ స్కోరు చేయడం పర్యాటక జట్టుకూ కష్టమే. అయినప్పటికీ వారికి ఆడేందుకు మూడు సెషన్లున్నాయి. చేతిలో ఇంకా 8 వికెట్లున్నాయి. ఫలితాలు తారుమారయ్యేందుకు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఫలితం తేలేది నేడే(సోమవారం).

ఫామ్‌లోకొచ్చిన అశ్విన్, జడేజా

ఇంగ్లాండ్ ముందున్న అభేద్య లక్షం 405

ఇంగ్లాండ్‌కు ఆడేందుకు ఇంకా మూడు సెషన్స్ ఆట మిగిలుంది

8 వికెట్ల భారం భారత్ బౌలర్లపైనే

గెలుపు అంచున భారత్… డ్రాకు కూడా అవకాశముంది

team-indiaన్యూఢిల్లీ: భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగు తున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. భారత్ నిర్దారించిన 405 పరుగుల లక్షఛేద నతో రెండో ఇన్నంగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాం డ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఓపె నర్లు హమీద్(25), అలస్టేయిర్ కుక్(54) లను మా త్రమే ఇంగ్లాండ్ కోల్పోయింది. మ్యాచ్ ఫలి తం చివరి రోజు వరకు వెళ్లింది. ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయావకాశాలు కనిపిస్తు న్నా, పటిష్టమైన ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు. వారి బ్యాటింగ్ రాణిస్తే మ్యాచ్ డ్రా అయ్యేందుకు కూడా అవకా శం ఉంది.
రాణించిన కోహ్లి
రెండో టెస్ట్ నాలుగో రోజు ఆదివారం భారత్ జట్టు 3 వికెట్లకు 98 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు తో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. అప్పటికే భారత 298 పరుగుల ఆధిక్యతలో ఉంది. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన సత్తాతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కోహ్లి (109 బంతుల్లో 81 పరుగులు, 8×4) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వైస్‌కెప్టెన్ అజింక్యా రహానె ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 4 పరుగులే జతచేసి ఆదిలోనే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్, వృద్ధి మాన్ షాలు త్వరగానే ఔట్ అయ్యారు. ఇంగ్లాం డ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ విరాట్ కోహ్లిని 81 స్కోరులో ఔట్ చేశాడు. రవీంద్ర జడేజా 14 పరుగులు, జయంత్ యాదవ్ అజేయంగా 27 పరుగులు, మొహ్మద్ షమీ 19 పరుగులు భార త్ స్కోరుకు జత చేశారు. దాంతో భారత్ 200ప రుగుల మార్కును దాటింది. చివరికి భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు ముందు 405 పరుగుల లక్షాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ జట్టులో స్టువర్ట్ బ్రాడ్, ఆదిల్ రషీద్ చెరో 4 వికెట్లు తీసుకుని రాణించారు.
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్
బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు అలస్టేయిర్ కుక్, హసీబ్ హమీద్ ఆచితూచి ఆటను కొనసాగించారు. ఇన్నింగ్స్ కొనసాగు తున్నకొద్దీ వారు తమ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోయారు. భారతీయ బౌలర్లను చెండాడేయడం మొదలెట్టారు. టీ విరామ సమ యానికి భారత్ జట్టు నిస్పృహకు లోనయ్యే లా విజృంభించారు. అంతేకాక ఇంగ్లాండ్ కెప్టె న్ కుక్‌కు అదృష్టం కలిసొచ్చింది. అతడు రెండు సార్లు డిఆర్‌ఎస్ సమీక్ష నుంచి తప్పించు కున్నా డు. ఇటీవల బాగా నిరాశపరుస్తున్న అశ్విన్ దగ్గరికి కెప్టెన్ విరాట్ కోహ్లి వెళ్లి సూచనలు చేశా డు. దాంతో ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ల భాగస్వా మ్యంలో 75 పరుగుల స్కోరు ఉన్నప్పుడు హమీ ద్‌ను(25) అశ్విన్ ఔట్ చేశాడు. మరోవైపు కుక్ నిలదొక్కుకుని ఆడడం మొదలెట్టాడు. పైగా తన 53వ అర్ధ శతకాన్ని నమోదు చేయడమేకా కుండా భారత్‌కు వ్యతిరేకంగా నాలుగో అర్ధశత కాన్ని చేశాడు. జడేజా తన చివరి బంతిలో కుక్‌ను ఎల్‌బిడబ్లు చేశాడు. ఫీల్డ్‌లోని అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించగా కుక్ సమీక్షను కోరాడు. కానీ థర్డ్ అంపైర్ కూడ భారత్‌కు అనుకూలంగా కుక్ ఔట్ అని నిర్దారించాడు. అప్పటి అంపైర్ కాల్ చాలా చర్చనీయాం శమైంది కూడా. ఇప్పటివరకైతే భారత్ జట్టే ఫేవరెట్‌గా ఉంది. అయితే ఇంగ్లాండ్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ రేపు(సోమవారం) విజృంభించి ఆడవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా ఉండనుందనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు కూడా చాలా బలంగానే ఉంది. బౌలింగ్‌లో కూడా ఇంగ్లాండ్ బాగా రాణించిందనే చెప్పాలి.