Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఔటర్‌ రింగు రోడ్డు పై లారీ దగ్ధం..

ఔటర్‌ రింగు రోడ్డు పై లారీ దగ్ధం..

Lorry accident in hyderabad outer ring road
ఘట్‌కేసర్ : ఔటర్‌రింగురోడ్డు పై కెమికల్ తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురై మంటలు చెలరేగిన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. నగరం నుండి విజయవాడకు లారీలో కెమికల్ తరలిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ కండ్లకోయ వద్ద ఔటర్ రింగురోడ్డు పైకి ఎక్కిన వాహనం, ఘట్‌కేసర్ రింగురోడ్డు వరకు రాగానే వాహనంలో నుండి పోగ రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే వాహనం నిలిపి వేసి, ఫైర్ స్టేషన్‌కు పోన్ చేయగా, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకునే సరికి వాహనం పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.