Home తాజా వార్తలు ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిన లారీ

ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిన లారీ

Road Accident

 

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి రాజధాని పార్లె ప్రాంతంలో వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిలో ఓ లారీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడింది. ఆటో, కారును ఢీకొట్టిన అనంతరం ఫ్లైఓవర్  పైనుంచి లారీ కిందపడింది. ఈ ప్రమాదంలో ఆటో, కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.