Tuesday, March 21, 2023

కారును ఢీ కోట్టిన లారీ…

- Advertisement -

lorry-accident
-అన్నసాగర్ ములమలుపులో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రెకర్స్‌ల కారణం

మన తెలంగాణ/కోట్‌పల్లి: ముందు పోతున్న కారును వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కోట్టడంతో తప్పిన పెను ప్రమాదం జరిగిన సంఘటన కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామం మారేపల్లి, మండలం కొండపూర్, జిల్లా సంగారెడ్డికి చెందిన పాండురంగారెడ్డి ఎవన్ టెక్స్ స్టాప్‌ వెరు కంపెనిలో ఉద్యోగం చేస్తున్నారని, రాజు గ్రామంలో వ్యవసాయ కూలి వీరు ఇద్దరు కలిసి తాండూర్ పట్టాణానికి బండాలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ బండలు మాట్లాడి ఇంటికి తిరుగు ప్రయాణంలో కోట్‌పల్లి మండలం అనుబంధ అన్నసాగర్ గ్రామం సమీపం నందుగల ములమలుపులలో వెళ్తున్న కారు నంబరు ఎపి 13 ఎస్ 7299 గాల కారును వెనుక నుండి వస్తున్న లారీ నంబరు ఎంఎచ్ 40 ఎకె 7786 మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకోట్టడంతో తప్పిన పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు.

-ములమలుపులో సూచిక బోర్డులు, స్పీడ్‌బ్రెకర్స్‌లు ఏర్పాటు చేయాలి అన్నసాగర్ గ్రామస్తులు
-అన్నసాగర్ ములమలుపులో సూచిక బోర్డులు, స్పీడ్‌బ్రెకర్స్‌లు లేక పోవడంతో గత 20 రోజుల క్రితం అదుపుదప్పి కారు బోల్టా కోట్టడంతో అక్కడే

వ్యక్తి మృతి చెందారని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన కాని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి అన్నసాగర్ ములమలుపులో సూచిక బోర్డులు, స్పీడ్‌బ్రెకర్స్‌లు ఏర్పాటుచేసి ప్రజల ప్రణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News