Home తాజా వార్తలు తండ్రి సినిమా టైటిల్‌తో చిత్రం!

తండ్రి సినిమా టైటిల్‌తో చిత్రం!

sara

 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రస్తుతం ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కార్తిక్ ఆర్యన్, సారాలు ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదలకానుందని తెలిసింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశేషమేమిటంటే దాదాపు 11 ఏళ్ల కిందట సారా తండ్రి సైఫ్ అలీఖాన్ హీరోగా ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. సైఫ్, దీపికా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత అదే దర్శకుడు అదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం.

Love Aaj Kal First Look Poster Released