Home తాజా వార్తలు రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

 

Suicide

 

బెంగళూరు: ప్రేమించుకున్న జంటకు పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హోసూరు- కెళమంగలం ప్రాంతం కారుగొండపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లారీ డ్రైవర్ పని చేస్తున్న ఎల్లేష్ (25), డిగ్రీ చదువుతున్న జ్యోతి గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం జ్యోతి కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఎల్లేష్ తన కూతురిని ఇచ్చి వివాహం చేయమని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బతికి ఇద్దరు జీవించలేమని అందుకే చనిపోదామని ప్రేమ జంట నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్రేమ జంట బైక్‌పై కెళమంగలం వైపు వెళ్లారు. కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి జంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు హోసూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Love Couple Commit Suicide in Karnataka