Thursday, April 25, 2024

ప్రేమజంట ఆత్మహత్య..!

- Advertisement -
- Advertisement -

పెళ్లికి అంగీకరించని ఇరు కుటుంబాల పెద్దలు
కడిచర్ల, ఏబ్బనూర్ గ్రామాల్లో విషాదఛాయలు


మనతెలంగాణ/వికారాబాద్‌ప్రతినిధి: ఇద్దరు కలిసి చదువుకున్నారు. అ పై కలిసి బతకాలనుకున్నారు. కానీ, వారి పెళ్లికి కులం అడ్డొచ్చింది. కులాన్ని, వయస్సును దృష్టిలో పెట్టుకొని వీరిపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో పెళ్లి జరగదేమోనని భావించి ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మొరంగపల్లి-సదాశివపేట రోడ్డు రైల్వేట్రాక్‌పై గురువారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళి తే… వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం కడిచర్ల గ్రామానికి చెం దిన పల్లె పవన్ కుమార్, ధారూర్ మండలం ఏబ్బానూర్ గ్రామానికి చెం దిన బేగారి అభినయలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరూ చిన్ననాటి నుంచి కలిసే చదువుకున్నారు. వికారాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు. పవన్‌కుమార్ ఇంటర్ మధ్యలో ఆపేశాడు. అభినయ కొంపల్లి గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. కళాశాలకు సెలవులు కావడంతో రెండునెలలుగా ఇంటి దగ్గరే ఉంటుంది. కాగా, వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, ఇరువురు పెద్దలకు తెలియడంతో.. ఇద్దరిని వారి తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసి హెచ్చరించడం, ఇద్దరికీ పెళ్లి వయస్సు రాలేదని, పైగా కులాంతర వివాహం చేయడం కుదరదని తేల్చిచెప్పడంతో, ఇక పెళ్లి జరగదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దీనిలో భాగంగా ఉదయాన్నే వీరిరువురూ వారి ఇళ్ల నుంచి పరారై కడిచర్ల గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్‌పై పడుకుని హైదరాబాద్- ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య పాల్పడ్డారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అభినయ, పవన్‌కుమార్‌లు గురువారం ఉదయం రహస్యంగా కలుసుకుని బైక్‌పై కడిచర్ల గ్రామ సమీపానికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనను చూసిన సమీప గ్రామస్తులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఇరువురి మృతదేహాలున్నట్టు గుర్తించి, వారి వద్ద లభించిన గుర్తింపుకార్డుల ఆధారంగా ప్రేమజంటగా భావించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News