Home తాజా వార్తలు ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

Suicide

తాండూరు : ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూరు డివిజన్ పరిధిలోని యాలాల మండలం ముకుందాపురం గ్రామంలో చోటుచేసుకుంది. యాలాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముకుందాపూరు గ్రామానికి చెందిన అశోక్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇదివరకే అశోక్‌కు వివాహం జరిగింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో హెచ్చరించారు. అశోక్‌కు వివాహం అయినందున ప్రేమ వ్యవహారం మంచిది కాదని యువతికి కుటుంబ సభ్యులు సూచించారు.

దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అశోక్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో బుధవారం తెల్లవారుజామున తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమజంట ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయ లు అలుమున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు యాలాల పోలీసులు తెలిపారు.

Love Couple Committed Suicide At Vikarabad