Friday, April 19, 2024

బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love couple committed suicide by jumping into a well

వరంగల్: వరంగల్ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ పట్టణ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లి పోలాల్లో ఈ విషాద ఘటన జరిగింది. ప్రేమికులు బైక్ పై నక్కలపల్లిలోని బావి దగ్గరకు వెళ్లారు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డిఆర్ఎఫ్ బృందం గజ ఈతగాళ్లు సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సెల్ ఫోన్ ఆదారంగా మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Love couple committed suicide by jumping into a well

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News