Home జోగులాంబ గద్వాల్ రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Love couples

 

జోగులాంబ గద్వాల: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపొతులపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. మృతులు ఉండవెల్లి మండలం ఇటీకాలపాడు గ్రామానికి చెందిన లోకేశ్, కస్తూరిగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.