Home జాతీయ వార్తలు పెద్దలు నో చెప్పారని.. ప్రేమజంట ఆత్మహత్య

పెద్దలు నో చెప్పారని.. ప్రేమజంట ఆత్మహత్య

Love Couple Suicide In Rajasthan

జైపూర్: ప్రేమ పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పారనే మనస్తాపంతో ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జల్వార్ జిల్లా గిర్దార్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గిర్దార్‌పుర గ్రామానికి చెందిన జితేంద్ర(19), రీనా(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారంలో ఇంట్లోవాళ్లకి తెలియడంతో ఇరువురి ఫ్యామిలీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారి పెల్లికి ఇరు కుటుంబాల పెద్దలు ససేమీరా అన్నారు. ఈ క్రమంలో రీనాకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన రీనా, జితేంద్రతో కలిసి గ్రామ శివార్లలోని కలిసింద్ నదీ తీరానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్లిన గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రేమజంట వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.